Sunday, October 19, 2025 10:30 AM
Sunday, October 19, 2025 10:30 AM
roots

పెద్దిలో తమిళ హీరో..? డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..!

ఈరోజుల్లో సినిమాల్లో గెస్ట్ రోల్ చాలా ప్రభావం చూపిస్తోంది. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాలు వరకు దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. వసూళ్లపై ప్రభావం పడటంతో చాలామంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో గెస్ట్ రోల్ చేయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గతంలో ఒక హీరో సినిమాలను మరో హీరో అభిమానులు చూసేవారు కాదు. కానీ గెస్ట్ రోల్ తీసుకురావడంతో వేరే హీరో అభిమానులు కూడా సినిమాలకు వెళ్తున్నారు. ఇటీవల మంచు విష్ణు ప్రధాన పాత్రలో చిన్న కన్నప్ప సినిమాకు ప్రభాస్ పాత్ర చాలా ప్లస్ అయింది.

Also Read : వన్డే సీరీస్ కు ముందు ఆసిస్ కు షాక్..!

వాస్తవానికి మంచు విష్ణు సినిమాలకు మార్కెట్ లేకపోవడంతో ప్రభాస్ ను ఒప్పించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాలో కూడా గెస్ట్ రోల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు డైరెక్టర్. హీరో, నిర్మాతలు ఇద్దరు ఓకే చేయడంతో.. ఓ తమిళ హీరోకు పది నిమిషాలు స్క్రీన్ టైమ్ ఇచ్చినట్లు టాక్. రామ్ చరణ్ కు తమిళ మార్కెట్ తక్కువ. ప్రస్తుతం అతను నటిస్తున్న పెద్ది సినిమా ఎక్కువగా మైసూర్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : విజయ్ దేవరకొండ యాక్సిడెంట్ వెనుక అసలు కారణం ఇదేనా?

ఇక మరో హీరో కూడా ఈ సినిమాలో ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎక్కువగా ఇబ్బంది పడ్డాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో మెగా ఫాన్స్ కూడా కాస్త డల్ గానే ఉన్నారు. దీనితో ఈ సినిమాను ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని డైరెక్టర్ తో పాటుగా సినిమా యూనిట్ మొత్తం తీవ్రంగా కష్టపడుతోంది. సినిమా బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు వెనక్కు తగ్గడం లేదు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ లుక్స్ తో పాటుగా వచ్చిన అప్డేట్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్