ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పిఠాపురం. 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం తన టికెట్ త్యాగం చేశారు ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక ఎన్నికల్లో జనసేనాని గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన వర్మ.. ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని బలంగా నమ్మారు. అయితే చివరి నిమిషంలో కూటమి అభ్యర్థిగా పవన్ పోటీ చేశారు. ఆ సమయంలో వర్మకు సర్థి చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎమ్మెల్సీగా అవకాశమిస్తామంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కల్యాణ్.
Also Read: ఈ వారంలోనే పదవుల భర్తీ.. వారికే పెద్ద పీట..!
కానీ ఆ తర్వాత నుంచి వర్మను పూర్తిగా పక్కన పెట్టినట్లుగానే తెలుస్తోంది. ఇక వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం.. ఇవ్వకపోవడం అనేది టీడీపీ అంతర్గత వ్యవహారం అని… దానికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పవన్ గెలుపు పూర్తిగా కార్యకర్తలు, ప్రజల వల్లే అని.. కానీ తమ వల్లే అని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ పరోక్షంగా వర్మ గురించే కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ అభిమానులు, వర్మ కార్యకర్తలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అటు వర్మ కూడా తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడంతో జనసేనతో పాటు సోంత పార్టీ నేతలపై కూడా అసంతృప్తిగా ఉన్నారు.
Also Read: హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ
అదే సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలు దూరం పెడుతున్నారనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఒకటి రెండు సార్లు ఘాటు నర్మగర్భంగా వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో వర్మతో మాకేం సంబంధం లేదన్నట్లుగా జనసేన నేతలు కూడా వ్యవహరించారు. ఈ సమయంలోనే వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ప్రజలే నా బలం అంటూ భారీ స్లోగన్ పెట్టారు. దానిపైన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఫోటోలు పెద్దగా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోటోలు చిన్నగా వేశారు. దీనిపై వర్మ అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిఠాపురంలో మీరు కష్టపడితే జనసేన నేతలు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read: ఫలించిన నల్లమిల్లి పోరాటం.. పరుగులు పెడుతున్న ప్రభుత్వ యంత్రాంగం…!
పిఠాపురం నుంచి వర్మను దూరం చేస్తున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు వర్మ. “కార్యకర్తే అధినేత” అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం అంటూ పోస్ట్ చేశారు. ప్రతి బుధవారం, ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి సమావేశాలు.. ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు, అభినందనలు అంటూ కామెంట్ చేశారు. దీనిపై కూడా కనీసం కార్యకర్తని గుర్తించమనండి చాలు.. ఇక మోసపోవడానికి సిద్ధంగా లేరు… అంటూ విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో వర్మ మళ్లీ యాక్టివ్ అవుతున్నారనే మాట ఇప్పుడు బాగా ప్రచారంలో ఉంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేత వర్మ అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.