Saturday, September 13, 2025 04:53 AM
Saturday, September 13, 2025 04:53 AM
roots

సూర్యలంక బీచ్ రేంజ్ మారబోతుంది

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల అభివృద్దిపై ఎక్కువ దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ కు భారీగా నిధులు కేటాయించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది కేంద్రం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు రూ.172.34 కోట్లు విడుదల చేసింది.

Also Read : కొలికిపూడి అల్టిమేటం.. అసలు గొడవేంటి..?

ఏపీ ప్రభుత్వ చొరవతో.. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.269.86 కోట్లు నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని పర్యాటక శాఖ చెప్తోంది. త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సరికొత్త హంగులతో పర్యాటకులకు బీచ్ దర్శనం ఇవ్వనుంది. సూర్యలంక బీచ్ లో మౌలిక వసతుల కల్పన, బీచ్ ను పరిశుభ్రంగా ఉంచే అంశంపై దృష్టిసారిస్తోంది ప్రభుత్వం.

Also Read : పాస్టర్ ప్రవీణ్ పగడాల రిపోర్టులో ఏముంది..?

అలాగే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపడుతోంది. నిధుల వినియోగం విషయానికి వస్తే రూ.15.43 కోట్లతో సూర్యలంక బీచ్ లో ఆహ్లాదకరమైన అనుభూతి కల్పన కొరకు.. రూ.4.37 కోట్లతో షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధి అలాగే రూ. 7.76 కోట్లతో స్థిరమైన పర్యాటకాభివృద్ధి, పర్యాటకుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, రూ.11.69 కోట్లతో కెనాల్ ఎక్స్‌ పీరియన్స్ డెవలప్ మెంట్, రూ.19.36 కోట్లతో సూర్యలంక ఎక్స్ పీరియన్స్ జోన్, రూ. 18 కోట్లతో ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్