Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

నష్టపరిహారమా.. జైలా? సుప్రీం కోర్ట్ లో మోహన్ బాబు బంతి..!

సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్ట్. నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇంట్లోకి వచ్చినంత మాత్రాన జర్నలిస్టుపై దాడి చేస్తారా అని సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారం కావాలా జైలుకు పంపాలా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది.

Also Read : పొట్టకింది కొవ్వును తగ్గించే సింపుల్‌ చిట్కాలు మీ కోసం..!

ప్రతివాదులు దాఖలు చేసే కౌంటర్లో అన్ని విషయాలు స్పష్టం చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణలో జడ్జిమెంట్ ఇస్తామని స్పష్టం చేసింది. సినీ నటుడు మోహన్ బాబు తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి. తన కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందని.. జర్నలిస్ట్ పై జరిగిన దాడికి బహిరంగంగా క్షమాపణ చెప్పానని మోహన్ బాబు తెలిపారు. నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను అని కూడా మోహన్ బాబు పేర్కొన్నారు. 76 ఏళ్ల వయసున్న తాను కావాలని దాడి చేయలేదని సుప్రీం దృష్టికి తీసుకు వెళ్ళారు.

Also Read : కార్యకర్తలతో జగనన్న.. మళ్లీ వాయిదా..!

ఆవేశంలో జరిగిందని… జర్నలిస్టులు గుంపుగా నా ఇంట్లోకి ట్రెస్ పాస్ చేశారని మోహన్ బాబు వాదనలు వినిపించారు. జర్నలిస్ట్ రంజిత్ తరఫున వాదనలు ఒకసారి చూస్తే.. రంజిత్‌పై మోహన్ బాబు దాడి చేశారని.. దవడ ఎముక విరికి సర్జరీ చేయాల్సి వచ్చిందని రంజిత్ 5 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్నారని సుప్రీం ధర్మాసనం ముందు వినిపించారు. నెల రోజులుగా పైపు ద్వారానే ఆహారం తీసుకుంటున్నారని దాడి చేయడమే కాకుండా కించపరిచేలా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. రంజిత్‌కు ప్రొఫెషనల్ గా నష్టం జరిగింది. కెరీర్ ను నష్టపోయారని రంజిత్ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్