Wednesday, February 4, 2026 10:00 AM
Wednesday, February 4, 2026 10:00 AM

వీధి కుక్కలపై సుప్రీం సంచలన కామెంట్స్..!

వీధి కుక్కలకు సంబంధించి గత ఆరు నెలల నుంచి సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. వీధుల్లో చిన్నారులు, మహిళలపై వీధి కుక్కలు దాడి చేయడంతో.. సుప్రీం కోర్ట్.. వీధి కుక్కలను జనాలు రద్దీగా ఉన్న ప్రదేశాల నుంచి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేసారు. సుప్రీం కోర్ట్ లో పలు పిటీషన్ లు కూడా దాఖలు అయ్యాయి. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ తాము ఇచ్చిన ఆదేశాలను కొంత సవరించిన సంగతి తెలిసిందే.

Also Read : పది నిమిషాల్లో డెలివరీ క్యాన్సిల్.. కేంద్రం వార్నింగ్..!

ఇక తాజాగా మరోసారి సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది. దేశ వ్యాప్తంగా ర్యాబీస్ మరణాలు సహా పలు దాడులను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఈ అంశంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా భద్రత, జవాబుదారీతనం, జంతు ప్రేమికుల పాత్రపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. పిల్లలు, వృద్ధులపై కుక్కల దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కలు ప్రాణాలు తీస్తుంటే కళ్లు మూసుకుని కూర్చోవాలా..? అని ప్రశ్నించింది.

Also Read : విజయ్ ను సిబిఐ ఏం అడిగింది..?

కుక్కల బెడదను ఆయా రాష్ట్రాలు అరికట్టాలి.. లేకుంటే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తాం అంటూ హెచ్చరికలు పంపింది. ప్రతి కుక్క కాటుకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. జంతు ప్రేమికులు, కుక్కలను పెంచుకుంటున్న వారు వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జంతు ప్రేమికులు కేవలం కుక్కల కోసమే స్పందిస్తారా? బాధితుల బాధ, ప్రాణనష్టం గురించి పట్టదా? అని నిలదీసింది. కుక్కల కంటే మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వరా? అంటూ నిలదీసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్