రాష్ట్రాల్లో గవర్నర్ ల అధికారాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సందర్భాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు పంపిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయడంపై ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో తాజాగా సుప్రీం కోర్ట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్ధిష్ట గడువు విధించలేమని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది.
Also Read : బీజేపి చీఫ్ ఆయనే..? కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు..!
గడువు విధించడం అధికారాల విభజనను తుంగలో తొక్కడమేనన్న సుప్రీంకోర్టు.. బిల్లుల విషయంలో గవర్నర్‌కు 3 ఎంపికలు మాత్రమే ఉంటాయని అభిప్రాయపడింది. బిల్లు ఆమోదం, అసెంబ్లీకి తిరిగి పంపడం, రాష్ట్రపతికి పంపటమే గవర్నర్ ముందు ఉన్న 3 ఎంపికలని సుప్రీం పేర్కొంది. మూడు అధికారాలు కాకుండా నాలుగో అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్ ముందు నాలుగో ఎంపిక లేదని తెలిపింది. ఈ సందర్భంలో చీఫ్ జస్టీస్ ఆసక్తికర కామెంట్ చేసారు.
Also Read : సొంత పార్టీ నేతలపై జగన్ ఫైర్..!
ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారం ఉందని స్పష్టం చేసింది. బిల్లులను సుదీర్ఘకాలం పెండిoగ్ లో పెట్టడం సరికాదని సీజేఐ జస్టిస్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. పున:పరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. తమిళనాడు గవర్నర్ కేసులో రాష్ట్రపతి, గవర్నర్లు శాసనసభ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి గడువు విధిస్తూ.. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును అడిగిన ప్రశ్నలకు సుప్రీం ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

