Saturday, February 14, 2026 01:00 PM
Saturday, February 14, 2026 01:00 PM

వద్దు వెళ్ళిపోదాం.. అమెరికాకు విద్యార్థులు, ఉద్యోగులు గుడ్ బై..?

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ఎంతో ఆందోళన కలిగించాయి. మొదటిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాల కంటే.. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు అత్యంత ప్రభావం చూపించాయి. వలసదారుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించడమే కాకుండా.. ఆ దేశంలో ఉన్న వారిని కూడా కొంత ఇబ్బందులకు గురి చేశారు ట్రంప్. దీనితో విదేశాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారాలు చేసేవారు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది.

Also Read : నవంబర్ రేసులో మెగాస్టార్, యువసామ్రాట్..!

విద్యార్థుల విషయంలో పార్ట్ టైం ఉద్యోగాలు కూడా లేకపోవడంతో చాలామంది ఆందోళనలో గడుపుతున్నారు. వాస్తవానికి అమెరికాలో విద్య ఖరీదైనది కాబట్టి చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఫీజులు కట్టుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు, అక్కడ ఉద్యోగాలు చేసే కొందరు, వ్యాపారాలు ప్రారంభించిన మరికొందరు.. తట్ట బుట్ట సర్దుకుని దేశం మారిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న వారి సమాచారం ప్రకారం.. ఆ దేశంలో రాను రాను పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

దీనితో చిన్న చిన్న కంపెనీల ప్రారంభించిన భారతీయులతో పాటుగా ఇతర దేశాలకు చెందిన వారు ఇప్పుడు ఆయా సంస్థలను మూసివేస్తున్నారు. అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఒత్తిడి కూడా, అక్కడి కంపెనీల పై పడుతోంది. వారికి వేతనాలు ఎక్కువగా చెల్లించే పరిస్థితి ఉండటంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటివరకు నెట్టుకు వచ్చిన చాలామంది విద్యార్థులు కూడా పోతే పోయిందని, స్వదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన ఎందరో విద్యార్థులు తిరుగుబాట పట్టినట్లు సమాచారం.

Also Read : హిట్ లిస్టులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ప్లాన్ అదేనా..?

హెచ్ 1 బీ వీసాలు.. రెన్యువల్ అయ్యే అవకాశం కూడా లేదనే సమాచారం ఉండటంతో మరికొంతమంది ఉద్యోగులు దేశం విడిచి సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇదే క్రమంలో ఇతర దేశాల్లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కెనడా, యూరప్ లోని కొన్ని దేశాల్లో చాలామంది తమ ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఉన్నట్లు సమాచారం. సొంత దేశాలకు తిరిగి వెళ్ళలేని వారు.. ఇతర దేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రాసెస్ కూడా మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక అమెరికా వెళ్లాలి అనుకునే ఉద్యోగులు, విద్యార్థులు కూడా తమ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అధినేతపై గుర్రుగా క్యాడర్.....

పార్టీ అధ్యక్షుడు ఎక్కడా..? అసలు ఆయన...

లోకేష్ కు జనసైనికులు...

నేటి రాజకీయాల్లో మాటకు మాట సమాధానం...

అంబటి దెబ్బ.. ఆ...

వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. మాజీ...

విజయవాడకు మెగా ప్రాజెక్టులు..!

కూటమి సర్కార్ ‌అధికారంలోకి వచ్చిన తర్వాత...

‘–40’ మార్కులతో వైద్య...

ఒకప్పుడు వైద్యుడు కావడం అంటే అత్యంత...

కేటీఆర్‌కు దిమ్మ తిరిగే...

టార్గెట్ కేటీఆర్, హరీష్ రావు అన్నట్లుగా...

పోల్స్