Friday, September 12, 2025 01:02 PM
Friday, September 12, 2025 01:02 PM
roots

ఆ కేసుల పరిస్థితి ఏమిటీ..?

ఏపీలో కూటమి సర్కార్‌‍పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందా..? కూటమి సర్కార్‌లో న్యాయం జరిగే పరిస్థితి లేదని ప్రజలు భావిస్తున్నారా..? అంటే.. అవుననే మాటే వినిపిస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డారనేది ప్రజల మాట. అలాగే తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లామనేది టీడీపీ నేతలు, కార్యకర్తల మాట. వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ప్రజలు.. ఓటుతో తమ తీర్పు వెల్లడించారు. అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా.. ఇప్పటికీ భయం భయంగానే బతుకుతున్నామనేది టీడీపీ శ్రేణుల మాట.

Also Read : అనంతబాబుకు సహకరించింది ఎవరు..? సిట్ విచారణలో సంచలనాలు..!

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా రెండు కారణాలు. అందులో ఒకటి జగన్‌పై కోడికత్తి దాడి. రెండోది మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ఈ రెండు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. కాబట్టి.. ఈ రెండు టీడీపీ నేతలే చేయించారనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఎన్నికల్లో కూడా ఇదే అంశాలను ప్రధానంగా ప్రచారం చేయడంతో.. వైఎస్ జగన్ చెప్పిన మాటలు నమ్మిన ఏపీ ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. జగన్ సీఎం అయ్యారు కాబట్టి.. సొంత బాబాయ్ హత్య కేసుతో పాటు కోడికత్తి దాడి కేసు విచారణ కూడా వేగంగా జరుగుతుందని.. నిందితులకు వెంటనే శిక్ష పడుతుందని అంతా భావించారు. కానీ ఇక్కడే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్‌కు నాలుగేళ్ల పాటు బెయిల్ కూడా రాలేదు. పైగా ఆ కేసు విచారణకు జగన్ ఏ మాత్రం సహకరించలేదు. దీంతో ఈ దాడి వెనుక ఓట్ల కుట్ర ఉందనే విషయం బయటపడింది.

Also Read : ఆపరేషన్ దుబాయ్.. లిక్కర్ కేసులో కీలక అడుగు..!

ఇక జగన్ సొంత బాబాయ్ వివేక హత్య కేసులో సొంత వారిపైనే ఆరోపణలు రావడం.. ఈ కేసులో సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం అడ్డుగా నిలిచిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వివేక హత్య కూడా ఎన్నికల్లో గెలుపు కోసమే చేశారనే భావన ప్రజల్లో వచ్చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు జగన్ చుట్టూ ఉచ్చు బిగించాయి కూడా. ఇక జగన్ ఏలుబడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టారు. వీటి వల్ల చాలామంది కార్యకర్తలు జైలు జీవితం గడిపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వారు.. ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను తొలగిస్తామని యువగళం పాదయాత్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ కూడా ఇచ్చారు.

Also Read : దొరికిపోయిన కొలికపూడి.. ఇప్పుడు కవరింగ్..!

కానీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కూడా ఇప్పటికే ఆ హామీ అమలు కాలేదు. ఇదే విషయంపై ఇప్పటికే హోమ్ మంత్రి అనిత సహా కనిపించిన నేతలందరినీ అడుగుతున్నారు. అయినా సరే.. దానిపై ఎలాంటి పురోగతి లేదు. దీనిపై కూడా సొంత ప్రభుత్వంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీటితో పాటు దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరి చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసు, రేపల్లె నియోజకవర్గంలో బీసీ యువకుడి సజీవ దహనం కేసు, మాచర్ల నియోజకవర్గంలో నడిరోడ్డుపైనే బీసీ నేత చంద్రయ్య హత్య కేసులో నిందితులు ఇప్పటికీ బయటే తిరుగుతున్నారు. ఇవే కాదు.. ఇలాంటివి ఎన్నో కేసులున్నాయని.. వీటిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్