ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘం దూకుడు ప్రదర్శిస్తుంది. పదవీకాలం ముగిసే ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనితో వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాశారు. ఓటర్ల జాబితాతో పాటుగా ఇతర ఎన్నికలకు సంబంధించిన కసరత్తును పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను జనవరిలో పూర్తిచేసి పరిషత్ ఎన్నికలను జూలైలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Also Read :వందే భారత్ స్లీపర్ రైలు ముహూర్తం ఖరారు..!
ఈతరుణంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీహార్ రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఈవిఎంలతో నిర్వహించారని.. ఒకవేళ ఈవీఎంలతో ఎన్నికల నిర్వహిస్తే వాటి కొనుగోలు సహా అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనితో ఈవీఎంలపై మరోసారి చర్చ మొదలైంది. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి ఈవీఎంలే కారణమని వైసిపి ఆరోపించిన సంగతి తెలిసిందే.
Also Read : చిరంజీవితో మరోసారి శర్వానంద్ ఢీ..!
దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తిని రేపుతోంది. అయితే దీనిపై రాజకీయ పరిశీలకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వైసిపి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వం బ్యాలెట్ తో ఎన్నికలకు వెళ్లడమే మంచిది అంటున్నారు. వైసిపి నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు కూడా పదేపదే ఈవీఎంల వ్యవహారంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఫలితాలతో వాళ్లకు కౌంటర్ ఇచ్చే అవకాశం ప్రభుత్వానికి దొరుకుతుందని.. ఇటు కూటమి కార్యకర్తలు కూడా ఈవీఎంల విషయంలో ఆరోపణలు చేసే వారికి.. సమాధానం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రజల్లో అభిప్రాయం కూడా మారే అవకాశాలుంటాయి.