Friday, October 24, 2025 11:52 PM
Friday, October 24, 2025 11:52 PM
roots

సెక్యూరిటీ కావాలి.. ఆఫ్రికా అధికారులకు రాజమౌళీ లేఖ

రాజమౌళి సినిమా అనగానే.. సినిమా జనాల్లో క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది. సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చిన సరే సోషల్ మీడియా షేక్ చేస్తారు ఫ్యాన్స్. నాలుగైదు ఏళ్లకు ఒక సినిమా చేసే రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్లు ఒకదానికి మించి మరొకటి కొట్టడంతో.. పాన్ వరల్డ్ రేంజ్ లో.. రాజమౌళి సినిమాలపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా స్పీడ్ అప్ అయింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 30% కంప్లీట్ చేశాడు రాజమౌళి.

Also Read : రెడ్ బుక్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!

2027లో ఎలాగైనా సినిమాను లేట్ చేయకుండా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఏడాది నవంబర్ లో టీజర్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను లీక్ ల వ్యవహారం.. మరింత ఇబ్బంది పెడుతోంది. ఒడిశాలో సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఓ సీన్ లీక్ చేశారు. ఇప్పుడు ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా అటువంటి పరిస్థితి ఎదురైంది. బాహుబలి సినిమా నుంచి రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినా సరే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. అయితే ఈసారి ఆఫ్రికా వాళ్ళ నుంచి రాజమౌళికి తలనొప్పి ఎదురవుతున్నట్లు సమాచారం.

Also Read : కవిత ఆ పని చేస్తే కామెడీ అవుతారా..?

షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలకు అక్కడ లోకల్ గా ఉండే ప్రజలు పెద్ద ఎత్తున రావడమే కాకుండా.. సినిమా షూటింగును తమ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇండియాలో సినిమా షూటింగ్ అయితే కండిషన్స్ పెట్టే రాజమౌళి అక్కడ షూటింగ్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే ఆఫ్రికా ప్రభుత్వానికి తమ సినిమాకు సెక్యూరిటీ కావాలని ఓ లేఖ రాసినట్లు సమాచారం. భద్రత పరంగా తమకు సహకరించాలని.. సినిమా ప్రైవసీని కాపాడాలని.. భద్రతకు సంబంధించిన ఖర్చు తాము పెట్టుకుంటామని స్థానిక అధికారులకు రాజమౌళి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారట. మహేష్ బాబు లుక్, సినిమా షూటింగ్ స్పాట్, సహా పలు కీలక విషయాలు లీక్ కావడంతో మళ్లీమళ్లీ ఆ సీన్స్ మార్చి షూట్ చేయాల్సి వస్తోంది. అందుకే మరింత భద్రత కోరినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్