Saturday, September 13, 2025 06:56 AM
Saturday, September 13, 2025 06:56 AM
roots

సౌత్ ఇండియా నయా స్టార్ సంజూ.. రికార్డులు బ్రేక్

ఎన్నో అవకాశాలు, ఎన్నో సార్లు జట్టుకు ఎంపిక కావడం, కాని ఎప్పుడూ కూడా జట్టులో స్థిరమైన చోటు లేదు. తుది జట్టులో అవకాశాల కోసం బెంచ్ పై ఎన్నో ఏళ్ళగా ఎదురు చూపులు. తన కంటే చిన్న వాళ్ళు జాతీయ జట్టులో అడుగు పెడుతుంటే అవకాశాల కోసం ఎదురు చూసిన పరిస్థితి. వచ్చిన అవకాశాలను ఒత్తిడితో చేజార్చుకోవడం… దీనితో సోషల్ మీడియాలో ట్రోలింగ్. కానీ ఐపిఎల్ లో మాత్రం మెరుగైన ప్రదర్శన. ఇది కేరళ క్రికెటర్ సంజూ సామ్సన్ లైఫ్. ధోని, కోహ్లీ, రోహిత్ ఇలా ఏ కెప్టెన్ కూడా సరైన అవకాశాలు ఇవ్వలేదు.

Also Read: ఛాన్స్ ఇస్తారా..? బెంచ్ కే పరిమితం చేస్తారా..?

కానీ సూర్య కుమార్ యాదవ్ టి20 కెప్టెన్ అయిన తర్వాత సంజూ సాంసన్ కెరీర్ గేర్ మారింది. బంగ్లాదేశ్ తో జరిగిన సీరీస్ లో సంజూ దుమ్ము రేపి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో టి20 సీరీస్ కోసం అడుగు పెట్టి మొదటి మ్యాచ్ లోనే తాను ఎంత డేంజర్ అనేది ప్రపంచ క్రికెట్ కు చూపించాడు. డర్బన్ లో బౌన్సీ పిచ్ పై ఏ మాత్రం లెక్క చేయకుండా సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 47 బంతుల్లో సెంచరీ బాదాడు. భారత్‌ తరఫున టీ20ల్లో వరుసగా రెండు శతకాలు సాధించిన బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు.

Also Read: టీం ఇండియా డైనమైట్

ఓవరాల్‌గా గుస్తావ్‌ మెకాన్‌ (ఫ్రాన్స్‌), ఫిల్‌ సాల్ట్‌, రోసో కూడా ఈ ఫీట్‌ సాధించారు. భారత్‌ తరఫున ఓ టీ20 మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు (10) బాదిన ప్లేయర్‌గా రోహిత్‌తో సమంగా సంజూ నిలిచాడు. బౌలర్‌ ఎవరైనా హిట్టింగ్‌ను మాత్రం ఆపలేదు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేసాడు. ఫోర్ల కంటే సిక్స్ లు ఎక్కువగా కొట్టాడు అంటే సంజూ ఊచకోత ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మతో కలిసి సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించాడు. బౌలర్ ఎవరైనా సంజూ హిట్టింగ్ కె ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్