Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

అసలు వీళ్లు సౌతాఫ్రికా క్రికెటర్లేనా…?

క్రికెట్ పుస్తకాల్లో సౌతాఫ్రికా టీమ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. సుదీర్ఘ నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది ప్రొటీజ్‌ టీమ్. అయితే వచ్చిన వెంటనే పసికూన అనే పేరు బదులుగా ఆఫ్రికన్ లయన్ అనే పేరు తెచ్చుకున్నారు. ఐసీసీ ట్రోఫీలు సాధించకపోయినా… సౌతాఫ్రికాతో మ్యాచ్ అంటే మాత్రం బాబోయ్ అనేలా చేశారు. లక్ లేక ఐసీసీ ట్రోఫీలకు దూరమయ్యారనేది సౌతాఫ్రికా టీమ్‌పై ఉన్న సానుభూతి. ఇవన్నీ పక్కన పెడితే… సౌతాఫ్రికా పేరు చెబితే… అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది జాంటీ రోడ్స్. మైదానంలో రోడ్స్ ఉన్నాడంటే… అందరీ చూపు అటువైపే. బాల్ అటు వైపు వెళ్లిందా… క్రీజ్ దాటి వచ్చేందుకు బ్యాట్స్‌మెన్ భయపడాల్సిందే.

Also Read : ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో అవినీతి పుట్ట

పాకిస్తాన్ ప్లేయర్ ఇంజామామ్‌ ఉల్ హక్‌ను జాంటీ రోడ్స్‌ రనౌట్ చేసిన విధానం ఇప్పటికీ అలా క్రికెట్ ప్రేమికుల మదిలో నిలిచిపోయింది. మైదానంలో పాదరసంలా కదలడమే కాకుండా… బంతిని నేరుగా వికెట్లకు కొట్టడంలో రోడ్స్‌తో పాటు సౌతాఫ్రికా టీమ్‌ మొత్తం టాపర్స్. అందుకే రోడ్స్ రిటైర్‌మెంట్ తర్వాత అతన్ని ఫీల్డింగ్ కోచ్‌గా తీసుకున్నారు. ఇలాంటి టాప్ ఫీల్డర్లు ఉన్న టీమ్ సౌతాఫ్రికా. అయితే ప్రస్తుతమున్న జట్టు విషయంలో వీళ్లు కూడా సౌతాఫ్రికన్లా… అనే ప్రశ్న వినిపిస్తోంది. నిజమే… భారత్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీలతో చెలరేగిపోయారు. చెరో వంద బాదటంతో పాటు ఎన్నో రికార్డులను తుడిచిపెట్టారు కూడా.

Also Read : పుష్ప ప్రమోషన్స్ కి అతిధులుగా ఆ ముగ్గురు..!

అయితే ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీకి సౌతాఫ్రిక ఫీల్డర్లే కారణం అనే మాట సరిగ్గా సరిపోతుంది. తిలక్ వర్మ ఇచ్చిన 4 క్యాచ్‌లను సౌతాఫ్రికా ఫీల్డర్లు వదిలేశారు. ఒక సందర్భంలో అయితే ఇద్దరు ఫీల్డర్లు పరిగెత్తుకుంటూ వచ్చి… మధ్యలో బాల్ పడే వరకు చూస్తూ ఉండిపోయారు. ఇక తిలక్ వర్మ 90ల్లో ఉన్నప్పుడు సరిగ్గా చేతుల్లోకి వచ్చిన బాల్ కూడా వదిలేశారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఆటతో పాటు సౌతాఫ్రికా ఫీల్డింగ్‌పై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అసలు వీళ్లు సౌతాఫ్రికా జట్టేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి కొందరు నెటిజన్లు అయితే… డియర్ రోడ్స్‌.. మీ టీమ్‌కు కాస్త కోచింగ్‌ ఇవ్వొచ్చు కదా అంటూ పోస్టులు పెడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్