Friday, September 12, 2025 02:45 AM
Friday, September 12, 2025 02:45 AM
roots

మోడీ.. ఇది సిగ్గుచేటు.. సోనియా సంచలన కామెంట్స్ 

అంతర్జాతీయ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల వేదికగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి వైఖరి, ఇజ్రాయిల్ తో పాటుగా పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలను కాంగ్రెస్ సిద్దం చేసుకుని పార్లమెంట్ లో అడుగుపెట్టినట్టే కనపడుతోంది.

Also Read: గజపతి రాజు సిగరెట్ కష్టాలు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసారు. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. అనాగరిక చర్యగా అభివర్ణించిన సోనియా గాంధీ, వీటిని భారత్ ఖండించకపోవడం దారుణం అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ.. ఇజ్రాయిల్ తీరును తప్పుబట్టకపోవడాన్ని సోనియా ఖండించారు. సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు ఆమె. గాజా విషయంలో ప్రధానమంత్రికి స్పష్టమైన వైఖరి లేకపోవడం పిరికితనం అంటూ విమర్శించారు.

Also Read :పోటీ చేస్తున్నాం.. టీటీడీపీ కీలక ప్రకటన 

సోమవారం హిందీ వార్తాపత్రిక దైనిక్ జాగరణ్‌లో ప్రచురితమైన వ్యాసంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. 1974లో, ఇందిరా గాంధీ నాయకత్వంలో, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ను పాలస్తీనా ప్రజల ఏకైక, చట్టబద్ధమైన ప్రతినిధిగా గుర్తించిన మొదటి అరబ్ యేతర దేశంగా భారత్ అవతరించిందని సోనియా పేర్కొన్నారు. 1988లో, పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి అని ఆమె పేర్కొన్నారు.

Also Read : నన్ను కెలకొద్దు కెటిఆర్.. సంచలన విషయాలు బయటపెట్టిన సిఎం రమేష్

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులను ఖండించిన ఆమె.. ఆ ప్రతికారాన్ని పాలస్తీనా ప్రజలపై చూపించడం తగదని అభిప్రాయపడ్డారు. రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్ ప్రతీకారచర్యలు ప్రారంభమైనప్పటి నుండి 17,000 మంది పిల్లలు సహా 55,000 మందికి పైగా పాలస్తీనియన్ పౌరులు మరణించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్