టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహ*త్య వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. నిజాంపేటలోని తన నివాసంలో ఆత్మహ*త్యా యత్నం చేసిన కల్పనా.. ప్రస్తుతం అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి ఆమె తలుపు తీయకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత పోలీసులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు అనే దానిపై మాత్రం ఎటువంటి సమాచారం ఇప్పటివరకు స్పష్టంగా బయటకు రాలేదు.
Also Read :ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వరుస గిఫ్ట్ లు రెడీ…!
కానీ ఆమె రెండో భర్త ప్రసాద్ కారణంగానే ఆమె ఆత్మహ*త్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన ప్రసాద్.. ఆమె ఆత్మహ*త్య యత్నం చేసుకున్న విషయం తెలియడంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దీనితో పోలీసులు అతన్ని విచారించగా ఆమె ఆత్మహ*త్యకు, తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. గత కొన్నాళ్లుగా అవకాశాలు లేక ఆమె ఇబ్బందులు పడుతోంది. ఆర్థికంగా కూడా కల్పనకు ఇబ్బందులు ఉన్నట్లు సమాచారం.
Also Read : మెగా ఫాన్స్ కు రాంచరణ్ టెన్షన్
ఎస్పీ బాలసుబ్రమణ్యం బ్రతికున్న సమయంలో కల్పనకు మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నట్లు అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు పూర్తిగా అవకాశాలు రాకపోవడం.. కనీసం స్టేజ్ షోలు కూడా లేకపోవడంతో ఆమె ఒత్తిడికి గురవుతున్నారని.. దీనికి తోడు కుటుంబ సమస్యలు కూడా ఆమెను వెంటాడాయి అని.. అందుకే కల్పన ఆత్మ*హత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె ఆరోగ్యం పై ఎటువంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు ప్రకటించారు.