వైయస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై ఇప్పటికి రాజకీయంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. సింగయ్య అనే వైసిపి కార్యకర్త మరణానికి జగన్ తో పాటుగా ఆయన పార్టీ కార్యకర్తలు కూడా కారణమని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తనకు మైలేజ్ పెంచుకోవడానికి ఈ మరణాన్ని కూడా జగన్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు సైతం గట్టిగా వినపడుతున్నాయి. మొదట్లో పోలీసుల వైఖరి కూడా వైసీపీకి అనుకూలంగా ఉందనే ఆరోపణ కూడా వినబడింది.
Also Read : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన..!
ఇక ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో పోలీసులు కూడా తర్వాత వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతుండగా.. బుధవారం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సింగయ్య భార్య తాడేపల్లి వెళ్లారు. ఆయనను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. తన భర్త మరణానికి ప్రభుత్వమే కారణమనేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు సింగయ్య భార్య. ఆ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేయడం మొదలుపెట్టింది. ఇక ఆమె వ్యాఖ్యలు చూసినవారు ఒక్కసారిగా కంగుతున్నారు.
Also Read : టీం సెలెక్షన్ పై గంగూలి అసహనం.. బౌలర్లు ఎక్కడ..?
వాస్తవానికి జగన్ ను కలిసే ముందు వరకు ఆమె ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. ఆమె మీడియా సమావేశంలో వెనుక నిలబడిన వ్యక్తి ఆమెకు ఏం మాట్లాడాలో చెప్తూ కనిపించాడు. సింగయ్య భార్య కూడా అతని వెంట కంగారుపడుతూ చూస్తున్న వీడియోను టిడిపి రిలీజ్ చేసింది. దీన్నిబట్టి చూస్తే వైసీపీ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆమె మాట్లాడింది అనే విషయం క్లారిటీ వచ్చింది. ఘటన జరిగి దాదాపు రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు.
Also Read : సింగయ్య మృతి.. ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు..!
టిడిపి విడుదల చేసిన వీడియో చూసిన సోషల్ మీడియా జనాలు.. గతంలో వైయస్ వివేకానంద రెడ్డి మరణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వివేకానంద రెడ్డి కుమార్తెతో పదేపదే మీడియా సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయించింది వైసిపి. ఇప్పుడు కూడా దాదాపుగా సింగయ్య మరణం లో అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆమె ప్రెస్ మీట్ కు కొంత మంది వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేసుకునేలా ముందే ప్లాన్ చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి అంటే ముందే ట్రైనింగ్ ఇచ్చారని కలిసిన తర్వాత మాట్లాడాలని వైసీపీ నుంచి సూచనలు వెళ్లాయని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.