ఈ మధ్య కాలంలో చీజ్ వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తినే వారు చీజ్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే చీజ్ తినడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంతకు మించి ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు చీజ్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చీజ్ లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చీజ్ మంచిదే గాని తక్కువగా తింటే మాత్రమె ప్రయోజనాలు ఉంటాయి. చీజ్ తినడం వల్ల లాభ నష్టాలు ఒకసారి చూస్తే…
Also Read : రాజకీయాల్లోకి పీవీ సునీల్.. బిజెపి ప్రోత్సాహంతో కూటమి ప్రయాణం
చాలా వరకు చీజ్‌లో పిండి పదార్థాలు ఉండవు. చీజ్.. గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. సున్నాకు దగ్గరగా ఉంటుంది. దీని అర్థం చీజ్ రక్తంలో షుగర్ లెవెల్స్ పై తక్కువ ప్రభావం చూపిస్తుంది. చీజ్ టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. చీజ్ లో ప్రోటీన్ లు చాలా బాగుంటాయి. ప్రోటీన్ ఉన్న ఆహారం తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
Also Read : బూమ్రా కోలుకుంటాడా…? లేదంటే యువ బౌలర్ కు ఛాన్స్…!
ఇక నష్టాలు ఒకసారి చూస్తే.. డయాబెటిస్ ఉన్నవారికి చీజ్ వల్ల లాభాలు ఎన్నో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. చీజ్ మంచిదే కానీ అందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ కాకుండా అడ్డుకుంటుంది. దీని వల్ల బరువు పెరగడం, జీర్ణ సమస్యలకు కూడా దారి తీసే అవకాశం ఉంది. చీజ్ తినడానికి రుచిగానే ఉన్నా సరే.. అధిక కొవ్వు, కేలరీల కంటెంట్ ఎక్కువగా ఉండటంతో శరీరంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే చీజ్ తినే వారు… అధిక ప్రోటీన్ కంటెంట్ తో తింటే మంచిది. కొవ్వు, సోడియం తక్కువగా ఉండే చీజ్ ను తినడం ఉత్తమం.