గత కొన్నాళ్ళుగా భారత క్రికెట్ జట్టులో మార్పుల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టెస్ట్ ల నుంచి తప్పుకోవడం ఆ తర్వాత వన్డేల్లో అతనిని కెప్టెన్ గా తప్పించి, శుభమన్ గిల్ కు బాధ్యతలు అప్పగించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. శుభమన్ గిల్ కు అంత సామర్ధ్యం లేదని, అతని సారధ్యంలో జట్టు విజయం సాధించడం కష్టం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పించే దిశగా రాజకీయం నడుస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి.
Also Read : బూతులు తిడితే నెలకు లక్ష.. నాగార్జున యాదవ్ కు జగన్ గిఫ్ట్
ఈ తరుణంలో తొలిసారి కెప్టెన్ గిల్.. తనకు కెప్టెన్ పదవి రావడంపై మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసాడు. టెస్ట్ మ్యాచ్ మధ్యలో దీన్ని ప్రకటించారు అన్నాడు. కానీ దాని గురించి నాకు కొంచెం ముందే తెలిసిందని, సహజంగానే, ఇది ఒక పెద్ద బాధ్యత అన్నాడు. అంతకంటే పెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆ ఫార్మాట్ లో నడిపించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని హర్షం వ్యక్తం చేసాడు. గత కొన్ని నెలలుగా తనకు ఎంతో సానుకూలంగా ఉందని తెలిపాడు.
Also Read : అన్నాడిఎంకే తోనే టీవీకే.. పొత్తు ఫైనల్..?
కొన్ని నెలల క్రితం భారత టెస్ట్ కెప్టెన్ గా తన ప్రస్థానం ప్రారంభించిన గిల్, క్రికెట్ లో మూడు ఫార్మాట్ లలోనూ తనను తాను నిరూపించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. టి20 లలో కూడా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. తాను ప్రతీ మ్యాచ్ గెలవాలి అనుకుంటా అని, కానీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తనకు ఆసక్తిగా ఉందని, వీలైనంత వరకు పోరాటం చేస్తాను అంటూ కామెంట్ చేసాడు. రాబోయే నెలలు భారత క్రికెట్ కు అత్యంత కీలకమని అన్నారు.