Friday, September 12, 2025 09:56 PM
Friday, September 12, 2025 09:56 PM
roots

అయ్యర్ క్లాస్ హిట్టింగ్.. ప్యూర్ టెక్నిక్

ఐపిఎల్ ఫైనల్ కు చేరింది పంజాబ్ జట్టు. ముంబై తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది పంజాబ్ జట్టు. 203 పరుగులతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆదిలో కాస్త తడబడినట్టు కనపడింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్యా, ప్రబ్ సిమ్రాన్ సింగ్ ఇద్దరూ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాతి నుంచి పంజాబ్ బ్యాటర్లు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసారు. జోష్ ఇంగ్లిస్, నేహాల్ వధేరా దూకుడుగా ఆడతంతో.. లక్ష్యానికి క్రమంగా చేరువు అవుతూ వచ్చింది.

Also Read : తిరుమలపై వైసీపీ భారీ కుట్ర..!

అయితే ఇద్దరూ కీలక సమయంలో అవుట్ కావడంతో.. పంజాబ్ కాస్త కష్టాల్లో పడినట్టు కనపడింది. ఈ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్ కే గా నిలిచింది. అయ్యర్ క్రీజ్ లో ఉన్న సమయంలో జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది. అయినా సరే వికెట్ కాపాడుకుంటూనే భారీ షాట్ లు ఆడటానికి భయపడలేదు. ముఖ్యంగా బూమ్రా బౌలింగ్ లో అయ్యర్ ఆడిన షాట్ లు అద్భుతమనే చెప్పాలి. యార్కర్ లను ఫోర్లుగా మలుస్తూ.. యార్కర్ ఆడటం అంత ఈజీనా అన్నట్టు ఆడాడు అయ్యర్.

Also Read : వైసీపీలో మార్పులు జరుగుతాయా..?

ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా లేకుండా ఆదుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ లో అయ్యర్ కాస్త కంగారు పడతాడు అనే పేరుంది. అయినా సరే జాగ్రత్తగా ఆడుతూ తనపై ఉన్న విమర్శకు చెక్ పెట్టాడు. అయ్యర్ ధాటికి ముంబై ఏ దశలో కూడా కోలుకోలేదు. మరో ఓవర్ మిగిలి ఉండగానే అయ్యర్ మ్యాచ్ ముగించాడు. అశ్వని కుమార్ బౌలింగ్ లో.. మ్యాచ్ ముగించిన విధానం కూడా ఆకట్టుకుంది. అయ్యర్ ఆట తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రసంశలు కురిపిస్తున్నారు. కెప్టెన్ గా జట్టును ముందు ఉండి నడిపించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్