Sunday, October 19, 2025 11:00 PM
Sunday, October 19, 2025 11:00 PM
roots

అయ్యర్ కు గుడ్ న్యూస్.. ఆ ఫార్మాట్ కెప్టెన్ అతనే..?

భారత క్రికెట్ లో మలుపులు ఆశ్చర్యపరుస్తున్నాయి. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ఒక్కో మార్పు ఆశ్చర్యపరుస్తునే ఉంది. టెస్ట్ కెప్టెన్ గా యువ ఆటగాడు గిల్ కు బాధ్యతలు ఇచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో అతను మెరుగ్గా రాణించాడు. ఇక టి20 లకు సూర్య కుమార్ యాదవ్ నే కొనసాగిస్తూ, వైస్ కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేసి షాక్ ఇచ్చింది. ఇక వన్డే కెప్టెన్ బాధ్యతలను రిషబ్ పంత్ కు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

Also Read : విశ్వంభర.. సెకండ్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలుసా..!

ఈ సమయంలో జరిగిన ఆసియా కప్ జట్టు ఎంపిక విమర్శలకు దారి తీసింది. శ్రేయాస్ అయ్యర్ ను పక్కన పెట్టడంపై అభిమానులు తీవ్ర విమర్శలు చేసారు. అతని కెరీర్ తో ఆడుకుంటున్నారు అంటూ అభిమానులు మండిపడ్డారు. ఈ తరుణంలో నేషనల్ మీడియాలో ఓ సంచలన కథనం వచ్చింది. అతనికి వన్డే కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రకటన వచ్చింది. 70 వన్డేల్లో 48.22 సగటుతో ఐదు సెంచరీలతో 2845 పరుగులు చేసిన అయ్యర్ నిలకడగా రాణిస్తున్నాడు.

Also Read : సాక్షికి లీగల్ నోటీసులు..!

ప్రస్తుతం వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత తప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాతనే అయ్యర్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ సమయంలో గిల్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. దీనితో అతనిని వన్డే ఫార్మాట్ కు తదుపరి కెప్టెన్ ను చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కాని టెస్ట్ కెప్టెన్ బాధ్యతలు మాత్రమే అతనికి అప్పగించింది బోర్డు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్