గత అయిదేళ్లుగా వైసీపీ కార్యకర్తల పేరుతో సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వర్రా రవీంద్రా రెడ్డికి కోర్ట్… 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వర్రాను పోలీసులు కర్నూలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక అతన్ని రక్షించడానికి పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సాక్షాత్తు ఓ ఎస్పీని కూడా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగు బృందాలు వర్రా కోసం గాలించాయి.
Also Read : విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్..!
నిన్న ఉదయం మీడియా ముందు ప్రవేశ పెట్టె అవకాశం ఉందనే వార్తలు వచ్చినా… సాయంత్రం మీడియా ముందుకు పోలీసులు తీసుకొచ్చారు. ఇక అతని రిమాండ్ లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐప్యాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్లమని వర్రా అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ప్రస్తావించారు. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్ట్ చేసేవాళ్లం. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టినట్టు అతను అంగీకరించాడు.
Also Read : ఏందన్నా ఇది… సిగ్గుగా లేదా..?
నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్లమని తెలిపాడట. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్‌రెడ్డి సూచనలతో పోస్టులు చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం అని, జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని… 2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారు, షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామని అంగీకరించాడు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారు ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారని పవన్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టా వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకం అని వర్రా అంగీకరించాడు.