Tuesday, October 28, 2025 04:13 AM
Tuesday, October 28, 2025 04:13 AM
roots

కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?

2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఏమో గాని కడప నియోజకవర్గంలో ఆ పార్టీకి తగిలిన దెబ్బ మాత్రం చిన్నది కాదు. రాజకీయంగా దశాబ్దాలుగా అక్కడ పెత్తనం చెలాయిస్తున్న వైఎస్ కుటుంబానికి ఊహకు కూడా అందని ఎదురు దెబ్బలు తగిలాయి. వైఎస్ జగన్ మెజారిటీ కూడా భారీగా తగ్గింది. దానికి తోడు కడప ఎమ్మెల్యే సీటు కూడా కోల్పోయింది వైసీపీ. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఓడిపోతారేమో అనే కంగారు కూడా వైసీపీ వర్గాల్లో ఒకానొక దశలో కనపడింది.

Also Read : ఈ వారంలోనే పదవుల భర్తీ.. వారికే పెద్ద పీట..!

ఇప్పుడు కడప.. జిల్లా పరిషత్ పై టీడీపీ ఫోకస్ పెట్టిన సంకేతాలు వస్తున్నాయి. దీనితో కడప జిల్లా జడ్పీటీసీలను బెంగుళూరు క్యాంపుకు వైసీపీ అధిష్టానం తరలిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు హైదరాబాద్ తరలించారు. కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 27న జరగనున్న నేపధ్యంలో వైసీపీ జాగ్రత్త పడుతోంది. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?

జిల్లా పరిషత్‌ ఇంచార్జీ చైర్మన్‌ జేష్టాది శారద ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఇక వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జడ్పీటిసి రామగోవింద రెడ్డికి చైర్మన్ పదవిని ఖరారు చేయగా… టిడిపి పోటీ చేస్తుందా తప్పుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. మొత్తం 50 జడ్పీటిసిలలో ఒకరు రాజీనామా చేయగా,మరో రెండు స్థానాలు ఖాళీ ఉన్నాయి. మొత్తం 47 మంది జడ్పీటీసీలు ఉండగా.. వారిలో కొందరు టీడీపీ వైపు చూస్తున్న తరుణంలో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయింది. మెజారిటీ వైసీపీకి ఉన్నా.. టిడిపి గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడితే చైర్మన్ పదవి కోల్పోతామనే ఆందోళనలో వైసీపీ నాయకత్వం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్