Wednesday, October 22, 2025 06:16 PM
Wednesday, October 22, 2025 06:16 PM
roots

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్ చేసేవారు లేరా..?

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. కొందరు తీరు మాత్రం మారదు. ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో సొంత పార్టీ, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా సరే కొందరు మాత్రం తాము చేయాలనుకున్నది చేస్తూ ఉంటారు. మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది.. పోసాని కోటేశ్వరరావు వ్యవహారం ఇలాగే ఉంది. గత కొన్ని రోజులుగా పోసాని వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నా సరే ఆయన మాత్రం తన దందాలు ఆపడం లేదు. లిక్కర్ సిండికేట్ల నుంచి, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వెలువడే బూడిద వరకు ఆయన అక్రమాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ.

Also Read : శ్రీలేఖకు టీడీపీ క్యాడర్ మద్దతు.. ప్రభుత్వంపై విమర్శలు

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పెద్ద ఎత్తున.. అక్రమాలకు పాల్పడ్డారని.. మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా పోసాని కోటేశ్వరరావును లక్ష్యంగా చేసుకుని కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయనే కీలకంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బూడిద వెలవడుతుంటుంది.

ఈ బూడిదను పెద్ద ఎత్తున రవాణా చేస్తూ అమ్ముకుంటున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో దీని కారణంగా కాలుష్యం కూడా తీవ్రంగా పెరిగిపోతూ వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా పలువురు వీడియోలు పోస్ట్ చేసి విమర్శలు చేశారు. జాతీయ రహదారిపై దీని కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఇప్పటికీ ఈ వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక తిరువూరు నియోజకవర్గంలో కొండూరు నుంచి పెద్ద ఎత్తున గ్రావెల్ ను.. మైలవరం నియోజకవర్గం తీసుకొస్తున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణ.

Also Read : అతని కోసం.. బూమ్రాను బలి చేసాడా..?

ఈ గ్రావెల్ కారణంగా రోడ్లు కూడా దెబ్బతినడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో చేసే వ్యాపారాల్లో కూడా ఆయన వాటాలు అడుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీనితో కొత్తగా బిల్డింగులు కట్టేవారు, వ్యాపారాలు చేసేవారు ఎమ్మెల్యే బావమరిదికి వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉండే కొండల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారనే విమర్శలు సైతం వచ్చాయి. గతంలో ఈ అక్రమ మైనింగ్ పై దేవినేని ఉమా పెద్ద పోరాటమే చేశారు. ఇక ఇప్పుడు టిడిపిలో కూడా అదే కొనసాగడంతో పార్టీ కార్యకర్తలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మైలవరం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కూడా వాటాలు అడగడంతో చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బావమరిదిని ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే నియోజకవర్గం లో టిడిపికి భవిష్యత్తు ఉండదు అని హెచ్చరిస్తున్నారు పార్టీ కార్యకర్తలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్...

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త...

పోల్స్