Saturday, September 13, 2025 06:47 AM
Saturday, September 13, 2025 06:47 AM
roots

సంచలన పరిణామాల దిశగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణాలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా అయినా కూల్చాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది అనే ప్రచారం గట్టిగానే సాగుతోంది. తెలంగాణా కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి తమ పార్టీలోకి తీసుకోవాలని బీఆర్ ఎస్ నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని, శాసన సభా సమావేశాల తర్వాత ఈ ప్రయత్నాలు వేగం పెరిగాయని వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఎంత వరకు నిజం ఏంటీ అనేది స్పష్టత లేదు గాని కొన్ని వార్తలు, బీఆర్ఎస్ నేతల కొన్ని చర్యలు చూస్తుంటే మాత్రం అనేక అనుమానాలు వస్తున్నాయి.

ఇప్పుడు కవితకు బెయిల్ అనేది చాలా అవసరం. ఆమెను ఎలా అయినా బయటకు తీసుకు రావాలని కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత కూడా మానసికంగా, శారీరకంగా బాగా ఇబ్బంది పడుతున్నారట. ఈ నేపధ్యంలో తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పడేలా వారికి సహాయం చేయగలిగితే కవితకు బెయిల్ వస్తుందనే వార్తలు వస్తున్నాయి. బిజెపికి సంఖ్యా బలం సరిపోదనుకుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కీలక పదవులు బిజెపి నాయకులకి ఇవ్వడం, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలతో వచ్చే నాయకులకు కీలక మంత్రి పదవులు ఇచ్చే విధంగా చర్చలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదు

బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బిజెపి పై బీఆర్ఎస్ నేతలు పెద్దగా విమర్శలు చేయలేదు. అలాగే శాసన సభలో పక్క పక్కనే కూర్చుంటున్నారు. కాతేపల్లి వెంకటరమణా రెడ్డి అయితే కేటిఆర్ పక్కనే కూర్చున్నారు. ఇక సమావేశాలు అయిన తర్వాత ఆత్మీయంగా పలకరించుకునే ప్రయత్నం కూడా చేశారు. దీనితో బిజెపి, బీఆర్ఎస్ కలవడం దాదాపుగా ఖాయం అయిందని ఒక కీలక మంత్రికి ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత అప్పగించారు అంటూ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది చూడాలి. ఇదే జరిగితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం అని చెప్పుకోవాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్