బిజెపిలో, కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతుందా..? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. కొన్నాళ్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గంలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి. కానీ దీనిపై బిజెపి అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ముందుకు అడుగులు వేయలేదు. కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇక రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షుల మార్పులకు సంబంధించి ఆ పార్టీ అగ్రనాయకత్వం కార్యచరణ సిద్ధం చేసింది అనే వార్తలు సైతం వినిపించాయి.
Also Read : తుది దశకు మావోయిస్టు ఉద్యమం.. టార్గెట్ సాధించిన అమిత్ షా
అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పాటుగా బిజెపి నాయకత్వంలో కూడా మార్పులు చేసే అవకాశాలు ఉండొచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల గుజరాత్ లో మంత్రులందరూ రాజీనామా చేశారు. అదే తరహాలో బిజెపి అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మంత్రులతో రాజీనామా చేయించి కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కేంద్రంలో కీలక మంత్రులుగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది బిజెపి అధిష్టానం.
Also Read : పాత చంద్రబాబును చూడబోతున్నామా.. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం..?
వీరిలో ఒకరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండవచ్చు. ఈ ముగ్గురిలోనే మరొకరిని బిజెపి జాతియ అధ్యక్షుడిగా నియమించే సంకేతాలు కనబడుతున్నాయి. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. తమిళనాడు నుంచి ఒకరిద్దరూ కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లే అవకాశాలు సైతం కనపడుతున్నాయి. ఏది ఏమైనా బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో, బిజెపి నాయకత్వంలో సంచలన మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చు అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు.