Saturday, September 13, 2025 01:44 AM
Saturday, September 13, 2025 01:44 AM
roots

జత్వాని ఐఫోన్ కోసం సీతారామాంజనేయులు పాడు పని

ముంబై హీరోయిన్ జత్వాని కేసులో అప్పటి పోలీసు అధికారులు చేసిన ఒక్కో ఆగడం బయటకు వస్తున్నాయి. తాజాగా జెత్వానీ కేసులో తాజాగా మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కాదంబరిపై పోలీసులు మరో తప్పుడు కేసును నమోదు చేయడం సంచలనం అయింది. ఫిబ్రవరి పదో తేదీ నుంచి 14 వరకు కోర్టులో కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను పోలీసు కస్టడీకి అనుమతి తీసుకున్న పోలీసులు… జెత్వానీ ఉపయోగించే ఐ ఫోన్లను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేసారు.

వాటినీ పీఎస్ఆర్ ఆంజనేయులు తెరిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారట. ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఆమెతో ఐ ఫోన్లను తెరిపించేందుకు పీఎస్ఆర్ ఆదేశాల మేరకు కాంతిరాణా, విశాల్ గున్నీ తీవ్రంగా ప్రయత్నించారని గుర్తించారు. ఫోన్లను తెరిచేందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ ను పిలిస్తే ఫోన్ లాక్ ఓపెన్ అవుతొందని విద్యాసాగర్ చెప్పడంతో ఆయనపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఆ తర్వాత ఫిబ్రవరి 10న పటమట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ స్పా సెంటర్పై పోలీసులతో దాడి చేసారు.

Read Also : జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వాల స్కాం

ఇందులో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అరెస్టు చేసి ఆమెను ఈ కేసులో ఏ1 గా చేర్చి కేసు నమోదు చేసారు. ఏ2గా.. కాదంబరీ జెత్వానీకి సన్నిహితుడైన అమిత్ కుమార్ సింగ్ పేరు చేర్చారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలతో కేసు నమోదు చేయడం గమనార్హం. కేసును అడ్డుపెట్టుకుని అమిత్ ను అరెస్టు చేసేందుకు ఆఘమేఘాలపై నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసారు. వారు విమానంలో దిల్లీకి వెళ్లేందుకు సీపీ కార్యాలయం నుంచే టికెట్లను బుక్ చేయడం విశేషం. ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదు. దీనితో పోలీసులు వెనక్కు వచ్చేశారు. ఈ లోపు జత్వాని కస్టడీ ముగిసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్