“సీ ప్లేన్లో” విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కి.మీ. గగనవిహారం చేయనున్నారు సిఎం చంద్రబాబు నాయుడు. భూమి ఉపరితలం నుంచి 1,500 అడుగుల ఎత్తులో సీ ప్లేన్ ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు భూమికి 15-20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. కాని సీ ప్లేన్లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉన్నా.. పర్యాటకులకు ప్రకృతి అందాలను చూసిన అనుభూతి కల్పించాలనే ఆలోచనతో తక్కువ ఎత్తులో ప్లాన్ చేసారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారు.
Also Read : జగన్ రెడ్డి.. ఇదేందయ్యా ఇదీ…?
ప్రయాణానికి 30 నిమిషాల సమయం మాత్రమే పట్టనుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు తీసుకుంటారు. ఇక 20 నిమిషాలు గగనంలో విహరిస్తారట. ప్రస్తుతం పున్నమిఘాట్ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్ ను అధికారులు ఎంపిక చేసారు. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిలోనే ఉండడం దీని ప్రత్యేకత. సాధారణ విమానాల్లా దీనికి రన్వే అవసరం లేదట. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయడం గమనార్హం. విజయవాడలోని పున్నమి ఘాట్లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేసారు. శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకొచ్చారు. జెట్టీ నుంచి ర్యాంపు ద్వారా సీ ప్లేన్లోకి ఎక్కేందుకు తగిన ఏర్పాట్లు చేసారు.
Also Read : కేతిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్…?
దీనితో మారుమూల, పర్యాటక ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచడానికి విమానయాన రంగాన్ని విస్తరించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రన్ వే అందుబాటులో లేని ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ మెరుగుపరచడం కోసం విమానాశ్రయాల కంటే తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో వాటర్ ఏరోడ్రోమ్ల అభివృద్ధి చేయడం గమనార్హం. ఉదయం 10.45కు సీఎం చంద్రబాబు పున్నమిఘాట్కు చేరుకుని.. 12 గంటలకు సీప్లేన్లో ప్రయాణం ప్రారంభించి 12.45 గంటలకు లోయర్ స్టేషన్ శ్రీశైలానికి చేరుకుంటారట. అక్కడ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి 2.20 గంటలకు సీప్లేన్లో బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు పున్నమిఘాట్ కు చేరుకుంటారు.

