Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

సంజు కెరీర్ ఆ షాట్ తో ఎండ్ అయిపోతుందా…?

అంతర్జాతీయ క్రికెట్ లోకి ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు సాధన చేస్తూ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆటగాళ్లు తమలో టాలెంట్ ఉన్నా సరే లోపాలను పరిష్కరించుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతుంటే లేటెస్ట్ గా షార్ట్ పిచ్ బాల్స్ విషయంలో సంజు సామ్సన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

Also Read : కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు..!

ఇంగ్లాండ్లో జరిగిన మూడు టి20 మ్యాచ్ లలో సంజు ఇలాగే వికెట్ పారేసుకున్నాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ వేస్తున్న బంతులను డిఫెన్స్ చేయలేక, ఇటు షాట్స్ కూడా ఆడలేక వికెట్ పారేసుకుంటున్నాడు సంజు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన సీరీస్ లో దుమ్మురేపిన ఈ కేరళ ఆటగాడు ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ లలో 26,5,3 పరుగులు మాత్రమే చేశాడు. షార్ట్ పిచ్ బంతులతో ఈ మూడుసార్లు అతన్ని ఆర్చర్ అవుట్ చేశాడు. సంజు తలను టార్గెట్ గా చేసుకుని బౌన్సర్ లు విసిరి ఈ ఇంగ్లీష్ పేసర్ వికెట్ తీసుకుంటున్నాడు.

Also Read : తెలంగాణా పల్లెల్లో ఎన్నికల నగారా..? రేవంత్ కీలక నిర్ణయం..!

దీనితో ఈ లోపం నుంచి బయటకు రావడానికి సంజు నానా కష్టాలు పడుతున్నాడు. ఇలాగే ఆడితే కెరీర్ ఫినిష్ అవుతుందనే భయంతో సిమెంట్ పిచ్ మీద ప్లాస్టిక్ బాల్స్ తో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తుది జట్టులోకి రావడానికి చాలా కష్టపడిన ఈ ఆటగాడు చాన్నాళ్ల పాటు బెంచికే పరిమితమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి పర్మినెంట్ ఓపెనర్ గా టి20లలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. అయితే షార్ట్ పిచ్ బాల్స్ విషయంలో ఒక ప్రణాళిక లేకపోవడంతో సంజు కెరీర్ పై నీలి నీడలను కమ్ముకున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్