పుష్ప పార్ట్ 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఓ మహిళ మృతి చెందిన ఘటనపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనపడటం లేదు. సంధ్య 70mm ధియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. ఇటీవల హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read : ఆస్ట్రేలియా విజయాన్ని లాగేసుకున్న ఆకాష్… బూమ్రా
సినిమా వాళ్ళపై కేసులు పెట్టడమే కానీ అరెస్టు చేసిన పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఇక ఈ ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికే తాము నోటీసులు కూడా ఇచ్చామని అయినా థియేటర్ యాజమాన్యం లెక్క చేయలేదు అని పోలీసులు తాము చేసిన హెచ్చరికలకు సంబంధించిన కొన్ని ఫోటోలను బయటపెట్టారు. దీనితో ఈ దీనితో ఈ ఘటన విషయంలో ఇప్పటివరకు అల్లు అర్జున్ అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని సమర్థిస్తున్న వాళ్ళు సైలెంట్ అయ్యారు.
Also Read : శిరీష చేసింది నేరం అయితే మీరు చేస్తున్నది ఏంటి..?
ఇక తాజాగా ఈ ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసుల త్వరలోనే సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు నిజమయ్యే పరిస్థితి కనపడుతోంది. సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. సంధ్య థియేటర్ లైసెన్స్ విషయంపై షోకాజ్ నోటీసులు జారీ చేసారు చిక్కడపల్లి పోలీసులు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ పోలీసుల నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు.




