Friday, September 12, 2025 05:07 PM
Friday, September 12, 2025 05:07 PM
roots

బాలీవుడ్ మాఫియాను లెఫ్ట్ లెగ్‌తో తన్నిన సందీప్ రెడ్డి

సాధారణంగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే విధంగా సృష్టించింది అక్కడి మాఫియా. ప్రాంతీయ భాషల సినిమాలను తక్కువగా చేస్తూ హిందీ సినిమాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ.. బాలీవుడ్ హీరోలే నటులు అన్నట్టుగా మార్చింది. వసూళ్ల పరంగా కూడా తమను ఎవరు డామినేట్ చేయలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు బాలీవుడ్ వెళ్లిన మాట వాస్తవం. అయితే గత కొన్నాళ్లుగా బాలీవుడ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. దక్షిణాది సినిమాల డామినేషన్ ఇండియా వైడ్ గా పెరగడంతో బాలీవుడ్ చుక్కలు చూస్తోంది.

Also Read : మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన కోహ్లీ..?

తెలుగుతో పాటుగా తమిళం.. కన్నడ సినిమాల డామినేషన్ పెరుగుతూ వస్తోంది. ఇదే టైంలో దక్షిణాది సినిమాలపై కాస్త డామినేషన్ ప్రదర్శించాలని బాలీవుడ్ నటులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సౌత్ సినిమాల నుంచి ఆఫర్ వస్తే.. భారీగా డిమాండ్ చేయడం, స్థాయికి మించిన కోరికలు నిర్మాతల ముందు ఉంచడం వంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఇలాగే ప్రవర్తించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే అహాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముందు చూపించింది. రెమ్యూనరేషన్ విషయంతో పాటుగా.. తన స్టాఫ్ విషయంలో కూడా కాస్త అతిగా ప్రవర్తించింది. దీనితో సందీప్ రెడ్డి వంగ ఆమెను తన సినిమా నుంచి పక్కన పెట్టాడు.

Also Read : పొత్తుపై కీలక వ్యాఖ్యలు.. వారికి మాస్ వార్నింగ్..!

ఈ విషయంలో బాలీవుడ్ మీడియా హడావుడి చేసినా సందీప్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గలేదు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్న వాళ్లకు అదే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఒక వర్గం మీడియా తనను టార్గెట్ చేస్తుందనే విషయాన్ని అర్థం చేసుకున్న సందీప్.. సినిమా గురించి, సినిమా స్టోరీ గురించి, సినిమా డైరెక్ట్ చేసే అంశం గురించి ప్రతి ఒక్కటి బాలీవుడ్ కు అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ కు సౌత్ ఇండియా నుంచి కూడా మంచి సపోర్ట్ లభించడంతో.. బాలీవుడ్ మాఫియా సైలెంట్ అయిపోయింది. భవిష్యత్తులో కూడా సందీప్ ఇలాగే బాలీవుడ్ విషయంలో ప్రవర్తించాలని అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సౌత్ ఇండియా పై డామినేషన్ చూపించాలి అనుకున్న వాళ్లకు సందీప్ రెడ్డి రియాక్షన్ ఖచ్చితంగా గుణపాఠం లాంటిది అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్