Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

ఏపీలో ఇసుక తలనొప్పులు ఇంకెన్నాళ్లు బాబుగారు..?

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమాల విషయంలో, మద్యం అక్రమాల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. డ్రోన్ తో, సీసీ కెమెరాలతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమాలు జరగకుండా నిఘా పెడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇసుక అక్రమాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయనే ఫిర్యాదులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్ళాయి అని టాక్. ఈ నేపధ్యంలో చంద్రబు కాస్త సీరియస్ గానే చర్యలకు సిద్దమయ్యారు.

ట్రాక్టర్ లను, ఎడ్ల బండ్లను అడ్డుకోవద్దు అని స్పష్టంగా చెప్పిన చంద్రబాబు… ఇసుక అక్రమాలకు పాల్పడే వారిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం దాటకుండా అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఆ ఆదేశాలు ఇవ్వడంతో పోలీస్ బాస్ లు ఇప్పుడు వెంటాడుతున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో నదుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఇప్పుడు వీటిపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో కొన్ని లారీలను అడ్డుకున్నారు.

Also Read : రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఈ లారీలకు అనుమతి ఉందని లారీ యజమానులు వాదిస్తున్నారు. తాము కిరాయికి ఇసుక తోలుతున్నా కూడా అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారని… వైసీపీ హయాంలో తమ లారీలు అన్నీ పనులు లేక అమ్ముకునే పరిస్థితి వచ్చిందని… ఇప్పుడు మళ్ళీ అప్పులు చేసి లారీలు కొని ఇసుక కిరాయిలు తోలుకుంటే అడ్డుకుని అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఖర్చు పెట్టామని, కిరాయిలు తోలుకుంటే అడ్డుకోవడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. అయితే ఇది జరిగితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం అంటోంది. ఏది ఎలా ఉన్నా ఈ ఇసుక వ్యవహారం మాత్రం ప్రభుత్వానికి, టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్