Friday, September 12, 2025 06:55 AM
Friday, September 12, 2025 06:55 AM
roots

బ్రాండ్ ప్రొమోషన్లకి ‘నో చెబుతున్న’ సమంత.. కారణమేంటి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఆమె క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమంత పారితోషికం సైతం ఏమాత్రం తగ్గకపోగా ఇప్పటికీ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. గతంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సమంత, ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఆమె కష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆమెకి మద్దతుగా నిలిచారు. అయితే గత ఏడాది కాలంలో సమంత ఏకంగా 15 బ్రాండ్ ప్రమోషన్లు వదులుకున్నారట. వారు భారీ ఆఫర్లు ఇచ్చినా చేయడానికి ఒప్పుకోలేదని పేర్కొన్నారు. మిగతా అన్ని విషయాల కంటే సెల్ఫ్ లవ్, ఆరోగ్యం, ప్రశాంతతకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Also Read : పోల్ : 2025 లో ఏ హీరో సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు?

ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలలో సమంత నటిస్తుండగా, ఆమె తర్వాత సినిమాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. తాను ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ వదులుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. 20 సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీలో అడుగుపెట్టానని, అప్పట్లో సక్సెస్ కు నిర్వచనం చాలా విభిన్నంగా ఉండేదని ఆమె కామెంట్లు చేశారు. ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నామనే దాని పైనే సక్సెస్ స్థాయిని నిర్ణయించేవారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోజు అలా ఉండటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఉత్పత్తులను ప్రమోట్ చేసే సమయంలో ఎంతో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే

ఏడాదిలో 15 బ్రాండ్స్ వదులుకున్నానని అమె చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నాకు ఎన్నో ఆఫర్స్ వస్తుంటాయని సమంత పేర్కొన్నారు. కాకపోతే ఆ ఆఫర్లను నేను అంగీకరించనని సమంత కామెంట్లు చేశారు. వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు తీసుకున్న తర్వాతే కొత్త బ్రాండ్స్ కు ఓకే చెబుతున్నానని సమంత తెలిపారు. మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోయిన్ సమంత చికిత్స తీసుకుంటూనే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే ప్రాజెక్ట్ తో ఆమె బిజీగా ఉన్నారు. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. సమంత నిర్మాతగా కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్