Wednesday, February 4, 2026 11:43 PM
Wednesday, February 4, 2026 11:43 PM

సాక్షి కులం రాతలు.. కాపు మహిళపై ప్రచారం

వైసీపీ రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా.. చావులతో రాజకీయం చేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే కులాలతో రాజకీయం చేస్తోంది అని విషయం కూడా జనాలకు క్లారిటీ ఉంది. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా వైసిపి గత దశాబ్ద కాలంగా ఎక్కువగా రాజకీయం చేసింది. జనసేన.. తెలుగుదేశం పార్టీతో కలిసిన ప్రతిసారి ఇదే తరహాలో రాజకీయం చేస్తూ రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసింది. ఇటీవల కందుకూరు లో జరిగిన ఘటనలో కూడా రెండు కులాల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం జరిగింది.

Also Read : రంగంలోకి పవన్.. సోషల్ మీడియాలో పవన్ తుఫాన్

తాజాగా గుంటూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. తాను ఆత్మహత్య చేసుకుంటూ టిడిపి నేతలే తన మరణానికి కారణమని, మండల స్థాయి నాయకుడు తనను వేధించాడని ఆమె ఓ వీడియో చేసింది. అయితే ఈ విషయంలో ఆమె ఎక్కడా కూడా తన సామాజిక వర్గాన్ని బయట పెట్టలేదు. కానీ వైసీపీ అధికారిక మీడియా సాక్షి న్యూస్ ఛానల్, పేపర్లో, అలాగే వైసిపి అనుకూల పత్రికల్లో.. కాపు మహిళను టిడిపి నేతలు వేధించారని.. టిడిపి మండల స్థాయి నాయకుడు కారణంగానే కాపు మహిళ ప్రాణాలు కోల్పోయిందని రాసుకొచ్చింది.

Also Read : జైస్వాల్ పై కావాలనే వివక్ష చూపుతున్నారా..?

దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాపులను పదేపదే వైసిపి అవమానిస్తోందని, ఏ ఘటన జరిగినా సరే కులాలను లాగుతుందని, వైసీపీకి 11 సీట్లు కూడా ఎక్కువేనని జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. వైసిపి నాయకులు ఎన్నో సందర్భాల్లో కాపులను అవమానించారని, వంగవీటి రాధ వంటి వాళ్లను అవమానించిన సందర్భాలు ఉన్నాయని, విజయవాడలో వంగవీటి రంగా విగ్రహాన్ని పెడితే పూనూరు గౌతమ్ రెడ్డి వంటి వాళ్ళు తొలగించే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారాన్ని కులం రంగు పులిమి జగన్ అండ్ గ్యాంగ్ పబ్బం గడుపుకోవాలని భావిస్తుందని జనసేన మండిపడుతోంది. ఓవైపు తుఫాను ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో వైసీపీ శవరాజకీయాలు మళ్లీ మొదలుపెట్టిందని విమర్శలు వస్తున్నాయి. కనీసం ప్రజలు ఇబ్బంది పడుతున్న సరే బెంగళూరు నుంచి జగన్ వచ్చి పరామర్శించలేదని.. అయినా సరే శవ రాజకీయాలు మాత్రం ఆగలేదని మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్