Friday, September 12, 2025 03:31 PM
Friday, September 12, 2025 03:31 PM
roots

రష్యా సంచలన ప్రకటన.. భారత్ ఆయిల్ కొనడం ఆగదు..!

భారత్ – రష్యా దేశాలు సన్నిహితంగా ఉండటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సుంకాలతో భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్యాకు భారత్ ఆర్ధికంగా అండగా నిలుస్తోందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల భారత్.. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేసిందని కూడా ట్రంప్ ప్రకటించడం సంచలనం అయింది. ఇప్పటికే పలు ఆయిల్ సంస్థలు ఈ విషయంలో వెనకడుగు వేసినట్టు సైతం ప్రచారం జరుగుతోంది.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?

ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ సలహాదారు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు. అమెరికా కోరిక మేరకే భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని వ్యాఖ్యానించారు. బైడెన్ కార్యవర్గం రష్యా నుంచి వచ్చే చమురు తీసుకోమని కోరిందని, చమురు ధరల్లో భారీ వృద్ది ఉండకుండానే ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇక తాజాగా ఈ చమురు వ్యవహారంపై రష్యా కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read : బ్రేకింగ్: సిఎంకు చెంప దెబ్బ.. ఢిల్లీలో సంచలనం..!

న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. అమెరికా, ఆర్ధిక వ్యవస్థను ఆయుధంగా చేసుకుందని మండిపడ్డారు. ఎంత ఒత్తిడి చేసినా సరే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం ఖాయమన్నారు. స్నేహితుల మధ్య ఆంక్షలు ఉండవని, రష్యా భారత్ పై ఎప్పుడూ ఆంక్షలు విధించే అవకాశం లేదన్నారు. 2030 నాటికి భారత్, రష్యా ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించే దిశగా పయనిస్తున్నాయని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్