Friday, September 12, 2025 06:47 AM
Friday, September 12, 2025 06:47 AM
roots

మోడీ రాజీనామా చేయాల్సిందే..? పట్టుబడుతున్న ఆర్ఎస్ఎస్..?

తాను పెంచిన పాము తననే కాటు వేసినట్టు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజెపిలో తీసుకువచ్చిన ఓ నిబంధన ఆయనకే తలనొప్పిగా మారే సంకేతాలు కనపడుతున్నాయి. 75 ఏళ్లకే బీజేపీలో రిటైర్మెంట్ అంటూ సీనియర్లను పక్కన పెట్టేందుకు ఉపయోగించిన అస్త్రం ఇప్పుడు తన పదవికి ఎసరు పెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. సీనియర్ నాయకులను 75 ఏళ్ల వ్యూహంతో మోడీ పక్కన పెట్టగా ఇప్పుడు ఆ నిబంధన ఆయన కూడా పాటించాలి అంటూ బిజెపి మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పట్టుబడుతోంది.

Also Read : పవన్ సినిమా హీరో కాదు మినిస్టర్.. ప్రమోషన్లో ఫెయిల్ అవుతోన్న జనసేన

అందరికీ ఒకటే రూల్ అంటూ బిజెపి వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ తలదుర్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు దీనిపై పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. సెప్టెంబర్ 17 తో మోడీకి 75 ఏళ్లు పూర్తవుతాయి. కాబట్టి ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో మోడీ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని బిజెపి నాయకులకు స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల వరకు తాను ప్రధానమంత్రిగా కొనసాగుతానని ఆ తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంటానని మోడీ చెప్పినట్లు సమాచారం.

అయితే ఈ వాదనను ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదు అంటున్నాయి జాతీయ రాజకీయ వర్గాలు. ఇతర నాయకులకు అవకాశం కల్పించాలి అంటే ఖచ్చితంగా మోడీ రాజీనామా చేయాల్సిందేనని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతుంది. ప్రధానమంత్రి పదవి కోసం హోం మంత్రి అమిత్ షా కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ గతంలో మాదిరిగా బలంగా మాట్లాడలేకపోతున్నారు. పాకిస్తాన్ వ్యవహారంతో పాటుగా అమెరికా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. వీటిపై మోడీ ఘాటుగా స్పందించలేకపోతున్నారు.

Also Read : పులివెందుల టీడీపీదే.. వైసీపీకి దక్కని డిపాజిట్ 

ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే.. భారత్ ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న సరే మోడీ మాత్రం ఘాటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. సుంకాల విషయంలో కూడా మోడీ అమెరికాను ఎదిరించే విధంగా మాట్లాడకపోవడం బీజేపీని ఇబ్బంది పెడుతోంది. ఓటర్ లిస్ట్ విషయంలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్న సరే మోడీ కౌంటర్ ఇవ్వడం లేదు. ఇవన్నీ గమనిస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కాస్త బిజెపి పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా మోడీ ప్రసంగాల్లో పట్టు కనపడటం లేదనే వాదన సైతం వినపడుతోంది. అందుకే ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. మోడీ రాజీనామా చేస్తే పార్టీపై కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం కలుగుతుందని, ఇతర పార్టీలకు సైతం అది ఆదర్శంగా ఉంటుందని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్