అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడి వన్డే క్రికెట్లో ఏకంగా మూడు డబల్ సెంచరీల సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అయితే గత ఏడాదికాలంగా రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. గత ఏడాది ప్రపంచకప్ లో దుమ్మురేపున రోహిత్ శర్మ ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయాడు. టి20 ప్రపంచ కప్ లో కాస్త పర్వాలేదనిపించాడు.
ఆ తర్వాత మాత్రం రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఇప్పుడు మెల్బోర్న్ లో జరగబోయే నాలుగో టెస్ట్ లో రోహిత్ శర్మ ఆట తీరుపై అభిమానులలో చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మూడో టెస్టులో అలాగే రెండో టెస్టులు దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ కీలకమైన నాలుగో టెస్ట్ లో రాణించాలని అభిమానులు కోరుతున్నారు. ఇక రోహిత్ శర్మ కూడా ఈ విషయంలో కాస్త పట్టుదలగానే ఉన్నట్టు కనపడుతోంది. విదేశీ మైదానాలపై పెద్దగా ప్రభావం చూపించని ఈ స్టార్ ఆటగాడు ఇప్పుడు నాలుగో టెస్ట్ లో రాణించటానికి ఏకంగా బేస్బాల్ బ్యాట్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
Also Read : చంద్రబాబు భద్రత భారీగా కుదింపు.. ఎందుకో తెలుసా?
ప్రాక్టీస్ సెక్షన్ లో ఎక్కువగా బేస్బాల్ బ్యాట్ తోనే డిఫెన్స్ ఆడాడు రోహిత్ శర్మ. ఫాస్ట్ బౌలర్లతో డిఫెన్స్ ప్రాక్టీస్ చేసిన సందర్భంలో బేస్బాల్ బ్యాట్ తో పాటుగా స్టంప్ తో కూడా ప్రాక్టీస్ చేశాడు. దీనితో రోహిత్ ఖచ్చితంగా నాలుగో టెస్ట్ లో రాణించే అవకాశం ఉందని సెంచరీ చేయవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఒక పక్కన యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనలు చేస్తుంటే రోహిత్ శర్మ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
జట్టులో తీవ్రమైన పోటీ ఉన్న సరే సీనియర్ ఆటగాడు అనే కారణంతో రోహిత్ శర్మను జట్టులో కొనసాగిస్తున్నారు. కెప్టెన్ అనే ట్యాగ్ కూడా రోహిత్ శర్మకు కలిసి వచ్చింది. అయితే ఈ సీరిస్ లో రోహిత్ విఫలమైతే మాత్రం కచ్చితంగా అతన్ని కెప్టెన్సీ నుంచి కూడా తప్పించే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాబట్టి రాబోయే రెండు టెస్టులు రోహిత్ శర్మకు బ్యాటింగ్ లో అత్యంత కీలకంగా ఉన్నాయి.