Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

రోహిత్ ను వెంటాడుతున్న “బౌల్డ్” భయం

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరు రోజురోజుకి తీసి కట్టుగా మారుతుంది. భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడే రోహిత్ శర్మ.. ఇప్పుడు పరుగులు చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కాస్త పరవాలేదు అనిపించిన రోహిత్ శర్మ.. ఇప్పుడు ఐపీఎల్ లో మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. కీలకమైన మ్యాచుల్లో కూడా రోహిత్ శర్మ దూకుడుగా ఆడలేకపోతున్నాడు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Also Read : ఐపీఎల్ ఓనర్లూ.. ప్రీతీని చూసి నేర్చుకోండి

కనీసం 20 పరుగులు కూడా చేయలేక వెనుతిరిగాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ బౌల్డ్ కావడం ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది. సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ బౌల్డ్ అవుతూ ఉంటారు. గతంలో సచిన్, లక్ష్మణ్, అలాగే ద్రావిడ్, జయవర్దనే, పాంటింగ్ వంటి వారు ఇదే సమస్య ఎదుర్కొన్నారు. బంతిని సరిగా అంచనా వేయలేక బౌల్డ్ కావడం.. తో వారిని క్రికెట్ నుంచి తప్పుకోవాలి అంటూ విమర్శలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ లో ఎక్కువగా బౌల్డ్ అవుతున్నాడు.

Also Read : కియాలో భారీ దొంగతనం..!

ఒకప్పుడు భారీ షాట్లు ఆడిన బంతులు ఇప్పుడు ఎదుర్కోలేక వికెట్లు పారేసుకుంటున్నాడు. సాదాసీదా బౌలర్లకు కూడా రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకోవడం చూసి అభిమానులు మదనపడుతున్నారు. ఇక తన ఆట తీరుపై రోహిత్ శర్మ సైతం అసంతృప్తి గానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్టు సీరిస్ నుంచి తప్పుకోవాలని రోహిత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా తప్పుకునేందుకు రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడని.. అయితే మరో ఏడాది పాటు జట్టులో కొనసాగి ఆ తర్వాత రిటైర్మెంట్ ఆలోచన చేయాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్