Friday, September 12, 2025 10:35 PM
Friday, September 12, 2025 10:35 PM
roots

ఇంగ్లాండ్ తో సీరీస్ కు ముందు రోహిత్ సంచలనం

గత కొన్నాళ్ళుగా ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న టీం ఇండియా స్టార్ ఆటగాడు, కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ కు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే భారత క్రికెట్ జట్టు రాబోయే టెస్ట్ సిరీస్ నుండి వైదొలగే అవకాశం ఉందని జాతీయ మీడియా సంచలన కథనం రాసింది. రోహిత్ శర్మ దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ వర్గాలు ధృవీకరించాయని పేర్కొంది.

Also Read : బ్రేకింగ్: లావు భద్రతపై సర్కార్ అలెర్ట్

విరాట్ కోహ్లీ జట్టులో తన స్థానాన్ని నిలుపుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ 3 మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్‌కు కూడా స్వయంగా తానే తప్పుకున్నాడు. జూన్ 20న హెడింగ్లీలో జరిగే తొలి టెస్ట్‌తో భారత్ తమ 45 రోజుల ఇంగ్లాండ్ పర్యటనను మొదలుపెట్టనుంది. 2007 తర్వాత ఇంగ్లాండ్ లో భారత్ ఇప్పటి వరకు సీరీస్ గెలవలేదు. ఇదిలా ఉంచితే జట్టు కూర్పుపై భారత్ కసరత్తు చేస్తోంది.

Also Read : డి లిమిటేషన్ పై రేవంత్ కీలక అడుగు

2024-25 రంజీ సీజన్‌ తో పాటుగా ఇతర ట్రోఫీల్లో ఆకట్టుకున్న కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, రంజీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు. నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో 54 సగటుతో రాణించాడు. దీనితో అతనిపై సెలెక్టర్లు నమ్మకం ఉంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇండియా ఏ ఆడబోయే మ్యాచ్ లకు అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్