Sunday, October 19, 2025 11:55 AM
Sunday, October 19, 2025 11:55 AM
roots

గుడ్ న్యూస్: డొమెస్టిక్ క్రికెట్ లో రోహిత్ – కోహ్లీ రీ ఎంట్రీ..!

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్న సమయంలో ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. వీళ్ళు ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రిటైర్ అవుతారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో.. ఇద్దరూ దేశవాళి క్రికెట్ ఆడతారు అంటూ జాతీయ మీడియా పేర్కొంది. 2026 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశీ వన్డే సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Also Read : కెప్టెన్ పదవి పై సమాచారం ఉంది.. గిల్ కామెంట్స్..!

రో-కో విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడతారని వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో జరిగే వచ్చే వరల్డ్ కప్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో దేశవాళి లిస్టు ఏ మ్యాచ్ లు ఆడతారనే ప్రచారం జరిగింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో చీఫ్ సెలెక్టర్ అగార్కర్.. వీళ్ళు విజయ్ హజారే ట్రోఫీలో ఆడతారని తాము భావిస్తున్నట్టు కామెంట్ చేసాడు. సంవత్సరం లేదా రెండు సంవత్సరాల క్రితమే, ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడల్లా వారు దేశీయ క్రికెట్ ఆడాలని తాము చెప్పినట్టు పేర్కొన్నాడు.

Also Read : పాక్ దారుణాలపై.. ఐరాసాలో పర్వతనేని హరీష్ సంచలన కామెంట్స్..!

పిటిఐ నివేదిక ప్రకారం , డిసెంబర్ 24న ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ కనీసం మూడు మ్యాచ్‌ లు ఆడతారు. డిసెంబర్ 6న విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగే చివరి వన్డేకు జనవరి 11న వడోదరలో న్యూజిలాండ్‌ తో జరిగే మొదటి వన్డే మధ్య, ఐదు వారాల విరామం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. ముంబై తరపున ఆరు రౌండ్ల మ్యాచ్‌ లు (డిసెంబర్ 24, 26, 29, 31, జనవరి 3, 6, 8) జరుగుతాయి. జట్టుతో చేరే ముందు రోహిత్ కనీసం మూడు రౌండ్ ల మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్