Tuesday, October 28, 2025 05:13 AM
Tuesday, October 28, 2025 05:13 AM
roots

రోజాకు మ్యూజిక్ స్టార్ట్.. పక్కా ప్రూఫ్స్ తో దొరికారా..?

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాల విషయంలో రాష్ట్ర సర్కార్ సీరియస్ గా దృష్టి సారించిన నేపధ్యంలో ఎవరిని, ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల అగ్రీగోల్ద్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ పై విచారణ పూర్తి చేసారు అధికారులు. అందులో జోగి తో పాటుగా ఆయన కుమారుడు, తమ్ముడు కూడా దోషులే అని స్పష్టం చేసారు రెవెన్యూ శాఖ అధికారులు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించారు.

Also Read : అడ్డంగా బుక్కైన జోగి..!

ఇక ఇప్పుడు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతిని బయటకు తీసే కార్యక్రమం పూర్తైనట్టుగానే కనపడుతోంది. ఆడుదాం ఆంధ్రా అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది విజిలెన్స్. మాజీ క్రీడా శాఖ మంత్రి రోజాపై కోట్లాది నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా స్కామ్ సంచలనం అయింది.

Also Read : లక్షల టన్నుల బంగారం.. ఇండియాలో భారీగా నిక్షేపాలు

క్రీడా మంత్రిగా రోజా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో 47 రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసారు. రూ.125 కోట్ల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. విజేతలుగా వైసీపీ కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు గుర్తించారు. 2023 డిసెంబర్ లో ఘనంగా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై స్టిక్కర్లు.. క్రీడా కారులకు నాసిరకం కిట్లు ఇచ్చారు. ఎక్కడా ఆటలను ప్రోత్సహించినట్లు కార్యక్రమం కనపడలేదు. కొత్త శాప్ ఛైర్మన్ ఛార్జ్ తీసుకునే లోపలే వివరాలు డిలీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్స్, సీఐడీ కమిటీలు వేయగా విచారణ జరిపి నివేదికను సిద్దం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్