కరోనా తర్వాత గుండెపోటు తో మరణం అనేది అత్యంత సాధారణ విషయంగా మారిపోయిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న పిల్లలకు కూడా గుండెపోటు రావడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. తాజాగా దీనిపై వెలువడిన ఓ అధ్యయనం మరింత ఆందోళన కలిగిస్తోంది. అధిక కొలెస్ట్రాల్, సరైన ఆహారం లేకపోవడం, ధూమపానం, అధిక రక్తపోటు వల్ల గుండెపోటు రావడం అనేది సహజంగా మనం వింటూ ఉంటాం. వచ్చిన గుండెపోట్లలో ఇవే ఎక్కువ. కాని ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : రేవంత్ గోప్యతకు కారణం అదేనా..?
యూకే, ఫిన్లాండ్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో.. గుండెపోటు అంటు వ్యాధుల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని తేలింది. ధమనుల ఫలకాలు, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ తో కూడిన కండరాలు, బ్యాక్టీరియా బయోఫిల్మ్ లను నిశ్శబ్దంగా కలిగి ఉంటాయట. జెలటినస్ అనే అంతర్గత నిర్మాణాలలో బ్యాక్టీరియా రహస్యంగా నివసిస్తుంది. ఆ బ్యాక్టీరియాను శరీర రోగనిరోధక వ్యవస్థ, యాంటీబయాటిక్స్ నాశనం చేయలేవు. ఈ బయోఫిల్మ్‌లు దశాబ్దాలుగా మన శరీరంలో రహస్యంగా ఉండే అవకాశం ఉంది.
Also Read : ప్రభాస్ పైనే ఆశలన్నీ.. నిర్మాతలను కాపడతాడా..?
కానీ వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర సందర్భాల్లో.. ఆ బ్యాక్టీరియాను మేల్కొల్పుతుంది. ఫలితంగా వచ్చే సమస్యలు.. ఆ బ్యాక్టీరియాను బయటకు తీసుకు వస్తాయి. ఇవి రక్తం గడ్డ కట్టేలా చేసి, గుండెపోటుకు కారణం అవుతాయని తేల్చారు. నోట్లో ఇలాంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించారు. గుండె సమస్యలతో బాధ పడే ఉద్యోగులకు ఇది మరింత ప్రమాదంగా పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఫ్లూకి సంబంధించిన టీకాలు వేసుకోవడం, అంటు వ్యాధుల నుంచి రక్షణ పొందడం వంటివి చేయాలని, ఎప్పటికప్పుడు ఈ బయోఫిల్మ్స్ ను గుర్తించే పరిక్షలు చేయించుకోవాలని పరిశోధకులు సూచించారు.