Friday, September 12, 2025 03:24 PM
Friday, September 12, 2025 03:24 PM
roots

టీం ఇండియా డైనమైట్

రిషబ్ పంత్… ఇప్పుడు ఈ పేరు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ సంచలనం. న్యూజిలాండ్ తో ముగిసిన టెస్ట్ సీరీస్ లో పంత్ ఆట తీరు అమోఘం అనే కామెంట్స్ అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఓ వైపు సీనియర్ ఆటగాళ్ళు, దేశవాళి క్రికెట్ లో పరుగుల వరద పారించిన ఆటగాళ్ళు బోల్తా పడుతున్న సమయంలో చాలా స్వేచ్చగా, మంచి టెక్నిక్ తో పంత్ ధైర్యంగా ఆడిన షాట్ లు చూసిన అభిమానులు, క్రికెట్ విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. మొదటి టెస్ట్ లో పంత్… మొదటి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో 99 పరుగులు చేసాడు.

Also Read : నీ సేవలు చాలు.. అరబిందోకి బాబు షాక్

ఆ మ్యాచ్ లో పంత్ ఆడకపోయి ఉంటే ఖచ్చితంగా భారత జట్టుకి ఇన్నింగ్స్ ఓటమి ఖాయం అయ్యేది. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులే చేసాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కీలక సమయంలో రన్ అవుట్ అయ్యాడు. అది జట్టు విజయాన్ని దెబ్బ కొట్టింది అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక మూడో టెస్ట్ లో పంత్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 120 పరుగులు చేసాడు. రెండు జట్లలో పంత్ మాత్రమే లీడింగ్ రన్ స్కోరర్. మూడో టెస్ట్ లో పంత్ ఆడకపోయి ఉంటే టీం ఇండియా ఇన్నింగ్స్ ఓటమి ఎదుర్కొన్న ఆశ్చర్యం లేదు.

Also Read : పోలవరం విషయంలో కీలక ముందడుగు

అజాజ్ పటేల్ బౌలింగ్ లో కీలక ఆటగాళ్ళు బోల్తా పడితే పంత్ మాత్రం రివెంజ్ తీర్చుకున్నాడు. అతని బౌలింగ్ లో పంత్ ఎకానమీ ఏకంగా 9.2. ఓ వైపు వికెట్లు పడుతున్నా కూడా చాలా కూల్ గా పంత్ బ్యాటింగ్ చేయడం, బౌలర్లపై సైలెంట్ గా ఒత్తిడి పెంచుతూ పరుగులు చేయడం పంత్ శైలి. ఆస్ట్రేలియా సీరీస్ లో ఖచ్చితంగా పంత్ కీలకం కానున్నాడు. ఆస్ట్రేలియా పిచ్ లపై పంత్ కు మంచి అనుభవం ఉంది. మిడిల్ ఆర్డర్ భారాన్ని పంత్ మోయడం అభిమానులకు సంతోషంగానే ఉన్నా… కీలక ఆటగాళ్ళు చేతులు ఎత్తేయడం భయపెడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్