Monday, October 27, 2025 11:19 PM
Monday, October 27, 2025 11:19 PM
roots

ప్రభాకర్ రావు కోసం రేవంత్ కొత్త అస్త్రం…?

తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం దాదాపు రెండు నెలల నుంచి సంచలనగానే మారింది. అప్పట్లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్లను టాప్ చేస్తుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీనిపై విమర్శలు చేసారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో కఠినంగానే వ్యవహరించారు. దీనికి సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారణ కూడా వేగవంతం చేశారు.

Also Read : చీజ్ తింటున్నారా…? ఇది చదివాక తినండి..!

అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇప్పటికే అమెరికా పారిపోయారు. వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సరే అవి పెద్దగా ఫలించడం లేదు. తాజాగా ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను దేశంలోకి రప్పించేందుకు నేరస్తులు అప్పగింత అనే అస్త్రం ప్రయోగించడానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. కరుడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో భారత్ కు అమెరికా మధ్య ఒప్పందం ఉంది.

Also Read : పోలవరం కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ ప్రత్యేకతలు ఇవే…!

ఈ ప్రక్రియలో భాగంగా కేంద్రానికి సిఐడి నివేదిక కూడా పంపింది. విదేశీ వ్యవహారాల శాఖ నుండి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. ఇద్దరినీ తిరిగి దేశంలోకి రప్పించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు ప్రభాకర్ రావు. మరోవైపు వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమ వలసదారుగా ఉంటున్నారు శ్రవణ్ రావు. ఇప్పటికి రెడ్ కార్నర్ నోటీస్ కు కసరత్తు కూడా చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇక వారి పాస్పోర్టులను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్