Friday, September 12, 2025 08:58 PM
Friday, September 12, 2025 08:58 PM
roots

రేవంత్ ను ఒంటరి చేసిన టీ కాంగ్రెస్

సాధారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉంటారు. ఎవరినైనా సరే విమర్శించే విషయంలో ఆయన వెనకడుగు వేయరు. ఇక తాను చేసింది ప్రచారం చేసుకునే విషయంలో కూడా ఆయన ముందు వరుసలోనే ఉంటారు. అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి హోదాలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది.

Also Read : నాయకుల వంతు.. మరో మాజీ మంత్రిపై మూడు కేసులు

ఆరు గ్యారంటీల్లో కీలకమైన రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నది. దాదాపు 15 రోజుల నుంచి లబ్ధిదారులకు పంపకాలు జరుగుతున్నాయి. రైతు భరోసా నిధులు రైతులకు జమవుతున్నాయి. గతంలో జరిగిన అక్రమాలకు అవకాశం లేకుండా ఇప్పుడు ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళను కూడా పెద్ద ఎత్తున పంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 26 నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. అయితే దీన్ని ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారు.

Also Read : దేవినేని అభిమానుల్లో చీలిక.. అవినాష్ గతం మర్చిపోయారా…?

అలాగే ఎవరైనా ముఖ్యమంత్రి టార్గెట్ గా లేదంటే ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్న సరే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ పెద్దగా స్పందించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ సైలెంట్ గా ఉండటం… ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేయడం చూసి కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ రెడ్డి ఇమేజ్ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కనీసం ఆయనకు మద్దతు లేకపోతే ఎలా అని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కీలక సమయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఒంటరిగానే పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పోరాటం అని. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పోరాటం చేస్తున్నారంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కారణంగా మంత్రి పదవులు తీసుకున్న వాళ్లు కూడా మౌనంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్