Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

జగన్ బాటలో రేవంత్… వాల్యూమ్ తగ్గించాలా…?

పదేళ్ల గులాబీ పార్టీ పాలనకు ముగింపు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. గత పదేళ్ళలో జరిగిన తప్పులను రేవంత్ రెడ్డి మళ్ళీ జరగనీయకుండా జాగ్రత్త పడతారని… అలాగే సంక్షేమ కార్యక్రమాల విషయంలో దూకుడుగా ఉంటారని చాలామంది అంచనా వేశారు. ఇక రేవంత్ రాజకీయ వ్యూహాలు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని అంచనాలోనే చాలామంది ఉంది.

Also Read : పోలీసుల ముందు బోరుగడ్డ సంచలన విషయాలు 

అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ ఓ కీలక తప్పు చేస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ౦ ఉన్న సమయంలో వైసీపీ నేతలు నోటికి ఏ విధంగా పని చెప్పారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. పదేపదే మాజీ సీఎం కేసీఆర్ ను తిట్టడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని రేవంత్ రెడ్డి మొండి పట్టుదలగా ఉన్నారు. వాస్తవానికి కెసిఆర్ విషయంలో తెలంగాణ ప్రజలు పెద్దగా ఆగ్రహంగా ఉన్నట్టుగా ఎక్కడా కనబడలేదు. కొన్ని జిల్లాల్లో కేసీఆర్ ప్రజలకు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యారు.

తెలంగాణను అభిమానించే వారి విషయంలో కెసిఆర్ కాస్త సానుభూతి కూడా పొందారు. కాబట్టి కేసీఆర్ ను పదే పదే తిడితే అది కచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు పలు రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా రేవంత్ రెడ్డి లేనిపోని అంశాల్లో కేసీఆర్ ను కలిపి తిట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం అనేది జరగని పని. కాబట్టి పదేపదే కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని ఈ సందర్భంగా ఆయనపై నోరు జారడం అనేది అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

Also Read : ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ

గతంలో వైసిపి ఇదే తరహాలో చంద్రబాబు నాయుడుని తిట్టడం ద్వారా ప్రజల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి ఇబ్బంది పడిందని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహిస్తే మంచిదని పలువురు హెచ్చరిస్తున్నారు. అలాగే కొన్ని కీలక సంక్షేమ కార్యక్రమాల విషయంలో రేవంత్ దృష్టి పెట్టాలని ముఖ్యంగా రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని… ఆ దిశగా ప్రయత్నాలు చేసి సమస్యలను పరిష్కరిస్తే మంచిదని పలువురు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్