Tuesday, October 28, 2025 04:59 AM
Tuesday, October 28, 2025 04:59 AM
roots

ఉగాండా అధ్యక్షుడితో కేసీఆర్ పోటీ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. తాజాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముందుగా గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి.. గవర్నర్ ప్రసంగం లేకుండానే గతంలో సమావేశాలు నిర్వహించారని కానీ గవర్నర్ ను గౌరవించే బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసిఆర్ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : భారత్ అమెరికా సంబంధాలపై సంచలన సర్వే

తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు అలాగే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తే ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగిన సరే వాళ్ళ కళ్ళల్లో మెరుపు కనిపిస్తోందని, పైశాచికత్వంలో ఉగాండా అధ్యక్షుడితోనే పోటీ పడుతున్నారని తన మార్కు కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్ నేతలు మాటలకు ముందు స్టేచర్ మాట తర్వాత స్టేచర్ అంటున్నారని స్టేచర్ ముఖ్యమా, స్టేట్ ఫ్యూచర్ వద్దా అంటూ ప్రశ్నించారు.

Also Read : ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నా..వైఎస్ సునీత సంచలన కామెంట్స్

కెసిఆర్ దగ్గర మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమేనని ఆ సీటుతో తానేం చేసుకుంటామని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అది హరీష్ రావుకు కేటీఆర్ కు కావాలని తమకు కాదని వ్యాఖ్యానించారు. స్టేచర్ కామెంట్స్ కెసిఆర్ ను ఉద్దేశించే తాను మాట్లాడానని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం గులాబీ పార్టీ మార్చురీలో ఉందని అందులో తప్పేముందని నిలదీశారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ చెడును తాను ఎందుకు కోరుకుంటానని ఆయన వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఇక్కడే అధికారంలో ఉండాలని కెసిఆర్ అక్కడే ప్రతిపక్షంలో ఉండాలని రేవంత్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్