Friday, September 12, 2025 07:46 PM
Friday, September 12, 2025 07:46 PM
roots

అక్కకు షాక్ ఇచ్చిన తమ్ముడు..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం దాదాపు ఖరారైంది. ఈ ఉగాది పండుగ నాటికి పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పాటు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. 2023 డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే 15 నెలలుగా సగానికి పైగా మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. పలువులు సీనియర్ నేతలు తమకు అమాత్య పదవి వస్తుందని గంపెడాశతో ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి తన ప్రతి ఢిల్లీ పర్యటనలో కూడా పార్టీ పెద్దలతో ఇదే విషయంపై చర్చిస్తూనే ఉన్నారు. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం రకరకాల కారణాలతో వాయిదా వేస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విస్తరణ వాయిదా వేయడం ఏ మాత్రం సరి కాదన్న రేవంత్ హెచ్చరికతో ఢిల్లీ పెద్దలు కూడా విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read: చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. జగన్ కోటకు బీటలు..!

ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరోస్తారు అనే విషయంపై చర్చ జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. “అనే నేను.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, విజయశాంతి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ భారత రాజ్యాంగం ద్వారా…” అంటూ పోస్ట్ చేశారు. అలాగే కింద ప్రస్తుత మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు విడిగా రాశారు. దాని కింద “+ మరో 2 ఖాళీ. వీటిని చూపించి మరో ఏడాది కాలం వెళ్ళదీయడం. Coming soon మాదిగలకు : డిప్యూటీ స్పీకర్, మున్నూరు కాపు : చీఫ్ విప్.” అంటూ కామెంట్ చేశారు.

Also Read: మంత్రి పదవి ఇస్తే సరి.. లేదంటే లేదంతే..!

మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీలో సామాజిక న్యాయం పాటించాలనేది కాంగ్రెస్ పెద్దల సూచన. ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక మైనారిటీ, ఒక ఎస్సీకి అవకాశం లభించే ఛాన్స్ ఉందంటున్నారు పార్టీ పెద్దలు. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖా, జూపల్లి కృష్ణారావులను తొలగించే అవకాశం ఉన్నట్లు సీఎంఓ వర్గాల సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్‌పైన విమర్శలు చేసిన కొండా సురేఖ.. ప్రముఖ నటి సమంతతో పాటు అక్కినేని కుటుంబంపై కూడా ఘాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సురేఖపై అక్కినేని నాగార్జున, కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సురేఖతో పాటు ఆమె భర్త మురళీపై పలువురు పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్