తెలంగాణలో ఇప్పటివరకు భారత రాష్ట్ర సమితి నేతలను పెద్దగా అరెస్టు చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. దీనితో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ లేదంటే కేసీఆర్లను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించారు. లిక్కర్ కుంభకోణంలో కవితను కేంద్ర దర్యాప్తు బృందాలు అరెస్టు చేసిన తర్వాత.. తెలంగాణలో రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read : తల్లికి వందనంపై విమర్శలు అందుకే రాలేదా..?
కేటీఆర్ పై ఎన్నో ఆరోపణలు రావటంతో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. అయితే విచారణలు జరగడమే కానీ ఇప్పటివరకు కేటీఆర్ మాత్రం జైలుకు వెళ్లిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. సాధారణంగా నోటి దురుసు ఎక్కువగా ఉండే కేటీఆర్ ఈమధ్య మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల చిల్లర గాడు అంటూ ఆయన చేసిన ఓ కామెంట్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటుగా.. సాధారణ ప్రజలనుంచి విమర్శలు వచ్చాయి.
Also Read : ఆ విషయంలో అన్నకు చెల్లి మద్దతు..!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి అటువంటి వ్యాఖ్యలే కారణం. దీనిని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా కొంత తప్పుపట్టారు. అయితే ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గానే తీసుకున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనితో కేటీఆర్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చు అని అభిప్రాయాలు వినపడుతున్నాయి. సోమవారం ఆయన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి కేటీఆర్ విచారణకు వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.




