Friday, September 12, 2025 11:00 AM
Friday, September 12, 2025 11:00 AM
roots

బీఆర్ఎస్ జుట్టు.. కేంద్రం చేతిలో పెట్టిన రేవంత్

కాళేశ్వరం ప్రాజెక్ట్.. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా దీని గురించి పెద్ద చర్చ జరిగింది. తెలంగాణలో ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గోదావరి నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్ళింది.

Also Read : బీజేపీ ఛీఫ్ ఎవరు..? వెంకయ్య సలహాకే ప్రాధాన్యత..?

అయితే నిర్మాణ వ్యయం విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ చేస్తామని స్పష్టం చేశారు. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ అధికారులతో పాటుగా రాజకీయ నాయకులను కూడా విచారించింది. ఇక అక్కడి నుంచి అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

Also Read : సజ్జలకు ఎర్త్ పెట్టిన నారాయణ స్వామి.. తర్వాత సలహాదారే..?

ఈ టైంలో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. అక్రమాల్లో పూర్తి విషయాలను వెలికి తీసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు బృందానికి ఈ కేసును అప్పగించడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి షాక్ అయింది. దీనిపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ హైకోర్టుకు వెళ్లి.. సిబిఐ విచారణ అడ్డుకోవాలని పిటీషన్ దాఖలు చేసినా సరే లాభం లేకుండా పోయింది. దీనితో మూడేళ్ల తర్వాత సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టింది. అప్పట్లో కెసిఆర్.. సిబిఐకి ఇచ్చే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవడంతో తెలంగాణలో సిబిఐ అడుగుపెట్టలేకపోయింది. ఇప్పుడు సాధారణ సమ్మతికి రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వడంతో సిబిఐ విచారణ మొదలైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్