ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్ళ ప్రభుత్వ పాలనను గమనిస్తే కొన్ని కీలక విషయాలు ఆసక్తికరంగా.. విడ్డూరంగా ఉంటాయి. ముఖ్యంగా అరెస్ట్ ల విషయంలో వైఎస్ జగన్ సర్కార్ అనుసరించిన వైఖరి చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. గతంలో నాయకులను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక పద్దతిని ఫాలో అయ్యేవారు. న్యాయస్థానాల్లో కేసులు వేస్తే నిలబడేలా అరెస్ట్ వ్యవహారాలు ఉండేవి అప్పట్లో. కానీ గత అయిదేళ్ళలో కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయినా నాయకులను అరెస్ట్ చేయాలనే కక్ష సాధింపు వైఖరినే ప్రదర్శించింది.

గత అయిదేళ్ళలో ఎవరి మీద కేసులు నమోదు చేసినా, ఎవరిని అదుపులోకి తీసుకున్నా ఏ ఒక్క కేసు కూడా రుజువు కాలేదు. బెయిల్ రాకుండా ఉండేందుకు… లేదంటే… బెయిల్ వస్తే లోపలే ఉంచడానికి కేసుల మీద కేసులు పెట్టింది సర్కార్. అయితే ప్రస్తుతం ఏపీలో నమోదు అయ్యే ప్రతీ కేసు వెనుక రాష్ట్ర ప్రభుత్వం పక్కా సాక్ష్యాలను సేకరిస్తుంది. ప్రతీ కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు అయ్యే అవకాశం, బలమైన ఆధారాలు ఉంటేనే… అవి దొరుకుతాయి అనుకుంటే ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందుకే ఐపిఎస్ అధికారులు సైతం ముందస్తు బెయిల్ కోసం నానా కష్టాలు పడుతున్నారు.
Also Read: ఈ నాటకాలు ఇంకెన్నాళ్లు జగన్..?
ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాల విషయంలో అదే వ్యూహం ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం కమీషన్ విచారణ జరుగుతున్న తీరు, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాస్పోర్ట్ లు రద్దు చేసే వరకు వెళ్ళడం, హైడ్రా చేపడుతున్న చర్యలు ఇవన్నీ కూడా పక్కా ఆధారాలతోనే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జస్టీస్ ఘోష్ చాలా లోతుగా విచారణ జరిపి… విచారణలో మొత్తం ఇంజనీర్లు, కీలక అధికారులనే పిలిచారు.

ఈ విచారణలో అధికారులు… రాజకీయ నాయకులే డిజైన్ ను ఫైనల్ చేసినట్టు స్పష్టం చేసారు. దానికి సంబంధించి తమకు ఏ పాపం తెలియదని కూడా కమీషన్ ముందు నిజాలు బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టే… ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. కేటిఆర్ పైకి ఏ రేంజ్ లో ధీమాగా ఉన్నా సరే… ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడం కూడా ఖాయంగా కనపడుతోంది. ఇప్పుడు రాజకీయ పెద్దల అరెస్ట్ ఆగాలి అంటే ఇదొక అద్భుతం జరగాల్సిందే.