Tuesday, October 28, 2025 01:49 AM
Tuesday, October 28, 2025 01:49 AM
roots

బిజెపిలో ఆ ఇద్దరే దొంగలు.. రేవంత్ సంచలన కామెంట్స్

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. హరీష్ ,కేటీఆర్ ఇటీవల ఏన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో చూడండి.. చీకటి ఒప్పదంలో భాగంగానే కేంద్రంలో ఉన్న వారిని కలసి వస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు అని రేవంత్ నిలదీశారు. ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని బోడి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటూ ఎద్దేవా చేసారు. ఉద్దేర మాటలు వద్దు..కేసీఆర్ అంటే గతమే..భవిష్యత్ లేదన్నారు. మెట్రో కి అనుమతి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు.

Also Read : వంశీకి మ్యూజిక్ స్టార్ట్..!

హైదరాబాద్ లో మూసి ప్రక్షాళన చేస్తే అంటే దాన్ని అడ్డుకునేది కిషన్ రెడ్డి అని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, మంత్రులతో నాకు సంబంధాలు ఉన్నాయి.. వాళ్లే నాకు చెప్పరు కిషన్ రెడ్డి అన్ని అడ్డుకుంటున్నారు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న దద్దమ్మ కిషన్ రెడ్డి అని మండిపడ్డారు. 10 నెలల్లో ఒక్క గంట కూడా నేను సెలవు తీసుకోలేదన్నారు సిఎం. టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, బండి సంజయ్ అని మండిపడ్డారు.

Also Read : ఆ విషయంలో అంతా ఫెయిల్..!

ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల నుంచి రప్పించిన 24 గంటల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులను జైల్లో పెడతామని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు భావో ద్వేగాలు రెచ్చగొట్టి ఓట్ల కోసం కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా ప్రభుత్వం ట్రంప్ తో మాట్లాడి ఎప్పుడు తెస్తావో కేంద్ర హోం మంత్రి సహాయ మంత్రి వెల్లడించాలన్నారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ సొల్లు వాగుడు కాదు..కులగణన పై తప్పు ఉంది అంటే దాన్ని రుజువు చేయాలని సవాల్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్